»   » శింబు వల్లే ఇదంతా... ఎట్టకేలకు నాగ చైతన్య కి విముక్తి

శింబు వల్లే ఇదంతా... ఎట్టకేలకు నాగ చైతన్య కి విముక్తి

Posted By:
Subscribe to Filmibeat Telugu

'సాహసం శ్వాసగా సాగిపో' రిలీజ్ డేట్ ప్రోమోలు కూడా రిలీజయ్యాయి. కాబట్టి నవంబరు 11న సినిమా కన్ఫమ్ అయినట్లే. 'ఏమాయ చేసావె' తర్వాత చైతూ-గౌతమ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో చైతూ సరసన మలయాళ అమ్మాయి మాంజిమా మోహన్ కథానాయికగా నటించింది. 'ఏమాయ చేసావె'లోని హీరో పాత్రను తీసుకుని.. దానికి కొత్త కథను జోడించి ఈ సినిమాను తెరకెక్కించాడు గౌతమ్. 'ఏమాయ చేసావె' పూర్తి స్థాయి లవ్ స్టోరీ కాగా.. ఇందులో సగం ప్రేమకథ, సగం యాక్షన్ ఉంటుంది. 'ఏమాయ చేసావె' తరహాలోనే దీన్ని కూడా తమిళంలో శింబు కథానాయకుడిగా తీశాడు గౌతమ్. ఈ సినిమా ఇంత ఆలస్యం కావడానికి కారణం కూడా శింబునే.

కానీ ఇప్పుడు వస్తున్న వార్తలు మాత్రం మరోలా ఉన్నాయి. ఇంకా తమిళ వెర్షన్ షూటింగ్ పూర్తి కాక పోవటమే తెలుగు వెర్షన్ మీదకూడా ప్రభావం చూపిస్తోంది. అయితే.. సాహసం శ్వాసగా సాగిపో లేట్ అవుతున్నా చైతూ ఏ మాత్రం టెన్షన్ పడ్డం లేదట. గౌతమ్ మీనన్ సినిమాలు ప్రతీసారి ఏదో ఒక ఇబ్బందుల్లో ఇరుక్కన్నా.. చివరకు రిజల్ట్ మాత్రం చాలా బాగా ఉంటుందని నమ్మతూ వచ్చాడు కానీ ఇప్పుడు మాత్రం ఆ నమ్మకం కూడా సన్న గిల్లుతోంది. ప్రేమం అనుకున్నంత హిట్ కాక పోయినా నాగ చైతన్యకి మాత్రం అద్బుతమైన పేరు వచ్చింది. ఆక్టింగ్ విషయం లో నాగచైతన్య చాలా ఎదిగినట్టే అన్న ఫీలింగ్ లో ఉన్నప్పుడే ఈ సినిమా కూడా వచ్చేస్తే సినిమాలో ఏదైనా లోపం ఉన్నా చైతు కి ఇప్పుడున్న హైప్ లో అవన్నీ కొట్టుకుపోతాయి.


Finally Naga Chaithanya Sahasam Swasagaa Sagipo Got a Release Date

అసలు ఎప్పుడో ఆర్నెల్ల కింద‌టే రిలీజ‌వ్వాల్సిన సినిమా 'సాహ‌సం శ్వాస‌గా సాగిపో'. ఐతే దీని త‌మిళ వెర్ష‌న్ షూటింగ్ హీరో.. కాంట్రవర్శీ కింగ్ శింంబు కార‌ణంగా ఆగిపోయింది. బీప్ సాంగ్ గొడవతో పాటు అనేక వివాదాల్లో చిక్కుకుని ఈ సినిమా షూటింగ్‌కు చాలాసార్లు డుమ్మా కొట్టాడు శింబు. స్వయంగా దర్శకుడు గౌతమ్ మీననే.. ఓ వేడుకలో శింబు వల్ల తాను పడుతున్న ఇబ్బంది గురించి ఆవేదన వ్యక్తం చేశాడు. తెలుగు-తమిళ వెర్షన్లకు ప్రతి సన్నివేశాన్ని ఒకే లొకేషన్లో తీయడం గౌతమ్‌ స్టయిల్.


ఇంతకుముందు ఏమాయ చేసావె.. ఎటో వెళ్లిపోయింది మనసు సినిమాలకు కూడా అలాగే చేశాడు. 'సాహసం శ్వాసగా సాగిపో' విషయంలోనూ అదే స్టయిల్ ఫాలో అయ్యాడు.అదే పద్దతిని సాహసం శ్వాసగా... విషయం లో కూడా రిపీట్ చేసాడు.. కానీ అదే గౌతం కి తలనొప్పిగా తయారయ్యింది. బీప్ సాంగ్ వివాదం తో కొన్నాళ్ళూ, తన సొంత గొడవలతో కొన్నాళ్ళూ లేట్ చేసి సినిమాని త్వరగా పూరికానివ్వకుండా చేసాడు...అతడి వల్ల నాగ‌చైత‌న్య కూడా వెయిటింగ్ లో ఉండిపోవాల్సి వ‌చ్చింది. డైరెక్ట‌ర్ గౌత‌మ్ మీన‌న్ కూడా వేరే సినిమాల ప‌నిలో ప‌డిపోయాడు. ఐతే ఈ మ‌ధ్య శింబు ఫ్రీ కావ‌డంతో ఒకేసారి తెలుగు.. త‌మిళ వెర్ష‌న్ల క్లైమాక్స్ పూర్తి చేశారు..


పెద్దగా ఆసక్తి లేని సినిమా ఎన్నిసార్లు వాయిదా పడ్డా ఇబ్బంది లేదు. కానీ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కి.. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతుంటే ప్రేక్షకులకు మామూలు అసహనం కలగదు. 'సాహసం శ్వాసగా సాగిపో' విషయంలో ఆడియన్స్ అలాంటి ఫ్రస్టేషన్లోనే ఉన్నారు. గత ఏడాది దీపావళికే ఈ సినిమా వచ్చేస్తుందని ప్రచారం జరిగింది. చూస్తుండగానే ఏడాది గడిచిపోయింది. ఈ దీపావళికి కూడా సినిమా విడుదల కాలేదు. ఐతే ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ డేట్ అఫీషియల్‌గా కన్ఫమ్ అయింది. ఈ నెల 11నే సాహసం శ్వాసగా ప్రేక్షకుల ముందుకి రానుంది. మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలంటే కాస్త ఓపిక పట్టాల్సిందే...

English summary
Akkineni Nagachaithanya New Movie Sahasam Swasaga Sagipo’s Hurdles Cleared, Movie hit the screens on this November 11th
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu