»   » తొలి '3డి' సైకిక్ థ్రిల్లర్ తెలుగులో 'ఓకే'

తొలి '3డి' సైకిక్ థ్రిల్లర్ తెలుగులో 'ఓకే'

Posted By:
Subscribe to Filmibeat Telugu

దేశంలోనే 3డిలో వస్తున్న తొలి సైకిక్ థ్రిల్లర్ మా సినిమా. తెలుగుతో పాటు హిందీ, తమిళంలోనూ ఈ సినిమా విడుదలవుతుంది. ఈ సినిమా ద్వారా తనీశ్‌ని బాలీవుడ్‌కు పరిచయం చేస్తున్నాం. హైదరాబాద్, విజయవాడ ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతాం అని నిర్మాత రాజ్‌వర్మ తమ కొత్త చిత్రం 'ఓకే' గురించి మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు. చక్రి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కెమెరా ఎస్ సంతోష్ సమకూరుస్తున్నారు. ఉషాకిరణ్ వారి నచ్చావులే చిత్రంతో పరిచయమైన తనీష్ ఈ చిత్రంలో హీరోగా చేస్తున్నారు.దిష, అశ్విత హీరోయిన్స్ గా చేస్తున్నారు.

హీరో తనీశ్ మాట్లాడుతూ "నేనిప్పటివరకు చేసిన సినిమాలు వేరు. ఈ సినిమా వేరు. సైకిక్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ద్వారా కొత్త తనీశ్‌ని చూస్తారు" అన్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం రామానాయుడు స్టూడియోస్‌లో ఉగాది రోజు ప్రారంభమైంది. డి ప్రవీణ్ ఈ చిత్రానికి దర్శకుడు. తొలి సన్నివేశానికి దర్శకుడు వివి వినాయక్ క్లాప్‌నివ్వగా, దక్షిణ భారత చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు సి కళ్యాణ్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దీనికి దర్శకుల సంఘాధ్యక్షుడు వి సాగర్ గౌరవ దర్శకత్వం వహించారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X