twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అద్నాన్ సమీ.. నువ్వు మగాడివిరా బుజ్జీ

    అద్భుతమైన గాయకుడిగా మనకు తెలిసిన గాయకుడు అద్నాన్ సమీ జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తి దాయకంగా అనిపిస్తుంది. జీవితంలో ఎన్నో ఎగుడుదిగుడులు, విషాదాలు, చేదు అనుభవాలు.

    By Rajababu
    |

    అద్భుతమైన గాయకుడిగా మనకు తెలిసిన గాయకుడు అద్నాన్ సమీ జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తి దాయకంగా అనిపిస్తుంది. జీవితంలో ఎన్నో ఎగుడుదిగుడులు, విషాదాలు, చేదు అనుభవాలు. ఇవన్నీ ఎదురైనప్పుడు మనోధైర్యాన్ని కోల్పోలేదు. రెట్టించిన ఉత్సాహంతో, ధైర్యంతో వాటిని ఎదురించాడు. తన జీవితానికి పెద్ద దిక్కు అయిన తండ్రి క్యాన్సర్ గురైనా, ముగ్గురు భార్యలు విడిచి వెళ్లినా.. తాను మోయలేని బరువును తగ్గించుకోవడం, పౌరసత్వ సమస్యలు ఇలాంటి ఎన్నో అటుపోట్లను అధిగమించి నేడు హీరో స్థాయికి చేరుకొన్నాడు. గాయకుడి మన్ననలు అందుకొన్న అద్నాన్ 'ఆఫ్ఘన్ ఇన్ సెర్చ్ ఆఫ్ ఏ హోం' చిత్రంతో నటుడిగా మారాడు. గాయకుడి నుంచి నటుడిగా మారే క్రమంలో ఆయన జీవితం ఏంటో ఓసారి చూద్దాం.

    లండన్‌లో జననం

    లండన్‌లో జననం

    అద్నాన్ సమీ 1971 ఆగస్గు 15న లండన్‌లో జన్మించాడు. తల్లి పాకిస్తాన్. తండ్రి ఆఫ్గనిస్తాన్‌కు చెందిన వారు. విద్యాభాస్యం అంతా బ్రిటన్‌లోనే జరిగింది. తన ఐదో ఏట నుంచే పియానోను వాయించేవాడు. రన్ ఫర్ హిస్ లైఫ్ అనే ఆల్బమ్ బ్రిటన్ చార్ట్ బస్టర్ నంబర్ వన్‌గా నిలిచింది.

    లిఫ్ట్ కరాదో..

    లిఫ్ట్ కరాదో..

    2000 సంవత్సరంలో కభీతో నజర్ మిలావో అనే పేరుతో ఆషా భోస్లే రూపొందించిన ఆల్బమ్‌తో అద్నాన్ సమీ సంగీత యాత్ర భారత్‌లో ప్రారంభమైంది. లిఫ్ట్ కరాదో అనే పాట బాలీవుడ్‌లో అగ్రస్థానాన నిలిపింది. ఆ తర్వాత వచ్చిన హమ్ దిల్ దే చుకే సనమ్, లగాన్ చిత్రాలతో అద్నాన్ పేరు మారిమోగిపోయింది. తాజాగా ఆయన పాడి నటించిన భజరంగీ భాయ్‌జాన్ చిత్రంలోని పాట ప్రజాదరణ పొందింది.

    తండ్రి మరణంతో విషాదం..

    తండ్రి మరణంతో విషాదం..

    తన జీవితానికి స్ఫూర్తిని అందించి ప్రేరణ కలిగించిన తండ్రి 2009లో మరణించాడు. ఆయన క్యాన్సర్ వ్యాధితో మరణించడంతో చాలా విషాదానికి లోనయ్యాడు. వాస్తవానికి 1989లోనే తన తండ్రికి క్యాన్సర్ వ్యాధి సోకినట్టు బయటపడింది. డాక్టర్లు 6 నెలల కంటే ఎక్కువ బతుకడని చెప్పారు. కానీ మనోబలం కారణంగా 20 ఏళ్లు బతికాడు అని చెప్పాడు. తన జీవితం నుంచి తండ్రి నిష్కమించడం తీరని లోటు అని పేర్కొంటారు అద్నాన్ సమీ.

    70 కిలోలు తగ్గిన వైనం..

    70 కిలోలు తగ్గిన వైనం..

    ఓ దశలో అద్నాన్ సమీ 250 కిలోల బరువు పెరిగాడు. నీ శరీరం మీద ధ్యాస పెట్టమని వైద్యులు హెచ్చరించారు. లండన్ క్రోమ్ వెల్ హాస్పిటల్‌లో చికిత్స జరిగిన తర్వాత 70 కిలోల బరువుకు తగ్గిపోయాడు. నేను 160 కిలోలు తగ్గుతానని ఎప్పుడు అనుకోలేదు అని అద్నాన్ చెప్తుంటాడు. తన తల్లి తరఫున వారికి స్థూలకాయ సమస్య ఉండేదని, అదే నాకు వచ్చిందని చెప్తుంటాడు అద్నాన్.

    ముగ్గురికి విడాకులు..

    ముగ్గురికి విడాకులు..

    నాకు భావుకత ఎక్కువ. కవితలు విపరీతంగా రాసేవాడిని. 1993లో నటి జేబా భక్తియార్‌తో తొలి వివాహం జరిగింది. మూడేండ్ల తర్వాత వారిద్దరూ విడిపోయారు. ప్రముఖ దర్శకుడు రాజ్ కపూర్ రూపొందించిన హీనాలో జేబా నటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 2001లో దుబాయ్‌కు చెందిన సబా గలధారిని వివాహం చేసుకొన్నాడు. ఆ తర్వాత ఒకటిన్నర సంవత్సరానికి వారిద్దరూ విడిపోయారు. కారణం అతిగా బరువు పెరుగడమే. 2010లో ఆఫ్ఘన్‌‌కు చెందిన రోయా సమీ ఖాన్‌ను మూడో వివాహం చేసుకొన్నాడు. ఆమెతో నాకు ఓ కుమారుడు ఉన్నాడు. ఆమెతో విడిపోయిన తర్వాత తన కుమారుడు రోయాతో కరాచీలో ఉంటున్నాడని చెప్పారు.

    బాలీవుడ్‌లో బిజీగా

    బాలీవుడ్‌లో బిజీగా

    ముంబైలో గాయకుడిగా బిజీగా మారిన అద్నాన్ భారత్‌లో స్థిరపడాలని నిర్ణయించుకొన్నారు. పాకిస్థాన్ పౌరసత్వం ముగిసిపోవడంతో మళ్లీ దరఖాస్తు చేసుకోన్నారు. అందుకు పాకిస్థాన్ నిరాకరించింది దాంతో 2015లో భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేశాడు. అద్నాన్ అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం 2016 జనవరి 1న పౌరసత్వాన్ని ఇచ్చింది.

    ఆఫ్ఘన్‌లో నటుడిగా తెరంగేట్రం

    ఆఫ్ఘన్‌లో నటుడిగా తెరంగేట్రం

    తన మధురమైన గాయంతో సంగీత అభిమానులను అలరించిన అద్నాన్ సమీ ప్రస్తుతం నటుడిగా మారారు. రాధికారావు డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘అప్ఘన్-ఇన్ సెర్చ్ ఆఫ్ ఏ హోం' ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. సల్మాన్ ఖాన్ నటించిన భజరంగీ భాయ్‌జాన్ చిత్రంలో ఓ పాటలో కనిపించిన అద్నాన్ సమి ప్రేక్షకులను ఆకట్టుకొన్నారు. యాక్షన్, డ్రామా ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమాలో అద్నానీ సమి ప్రధాన పాత్రను పోషిస్తున్నాడు. చిత్రయూనిట్ అద్నాన్ సమి ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేసింది. తాజా లుక్‌లో అద్నాన్ సమి పసుపుపచ్చ రంగులో ఉన్న తలపాగాతో ఇంటెన్సివ్ లుక్‌లో కనిపిస్తున్నాడు. నటుడిగా మరిన్ని శిఖరాలను అధిరోహించాలని కోరుకొందాం!

    English summary
    Adnan Sami will make his debut as an actor in new film titled Afghan - In Search Of A Home. The movie will be co-directed Radhika Rao and Vinay Sapru. The makers revealed the first look of Adnan as the protagonist of the film on Wednesday. The musician sports a yellow turban and a heavily bearded look for the character of a musician from Afghanistan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X