»   » కాటమరాయుడు రివ్యూ రిపోర్ట్ వచ్చింది, సూపర్ హిట్ పడ్డట్టే: ఉమైర్ సంధు రివ్యూ

కాటమరాయుడు రివ్యూ రిపోర్ట్ వచ్చింది, సూపర్ హిట్ పడ్డట్టే: ఉమైర్ సంధు రివ్యూ

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవన్‌కల్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణానికి మరికొద్ది గంటలే సమయముంది.రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా చిత్రం 'కాటమరాయుడు' రివ్యూను, రేటింగ్ ను యూకే, యూఏఈ సెన్సార్ బోర్డు సభ్యుడు, ఇండియన్ సినిమా మేగజైన్ ఎడిటర్ ఉమైర్ సంధూ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు.. ఆ వివరాలు....

ఒకరోజు ముందుగానే

ఒకరోజు ముందుగానే

మార్చి 24 శుక్రవారం నాడు థియేటర్లలో కాటమరాయుడు సినిమా సందడి చేయనుంది. ఓవర్సీస్‌లో అయితే ఒకరోజు ముందుగానే ఈ సినిమా ప్రీమియర్ షో ల ద్వారా విడుదల కానుంది. అజిత్ నటించిన సూపర్ హిట్ మూవీ వీరమ్ రీమేక్‌గా వస్తున్న పవన్ ‘కాటమరాయుడు'పై అంచనాలు భారీగానే ఉన్నాయి. సినిమా ట్రైలర్, పాటలు, పోస్టర్స్.. అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.


మార్చి 24న

మార్చి 24న

అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఈ సినిమా మార్చి 24న వెండితెరపై దర్శనమీయనుంది. భారీ అంచనాల నడుమ విడుదలవుతున్న ఈ సినిమా టిక్కెట్లు అప్పుడే చాలా వరకు అమ్ముడుపోయాయి. తమిళ సినిమా ‘వీరం' ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు కిషోర్ కుమార్ పార్దసాని దర్శకత్వం వహించారు.


చాలాసమస్యలనే ఎదుర్కొంది

చాలాసమస్యలనే ఎదుర్కొంది

పవన్ సన్నిహిత మిత్రుడు శరత్ మరార్ ఈ సినిమాను నిర్మించారు. అలీ, రావు రమేష్, నాజర్, శివబాలాజీ, ప్రదీప్ రావత్, కమల్ కామరాజు, అజయ్ ఇలా భారీ తారగణంతోనే సినిమా తెరకెక్కింది. సర్దార్ లాంటి భారీ ఫ్లాప్ తర్వాత వస్తున్న ఈసినిమా ఆరంభం లోనే చాలాసమస్యలనే ఎదుర్కొంది, దర్శకుడు, హీరోయిన్ ఇలా చాలానే ఇబ్బందులు ఎదురయ్యాయి. ఒక దశలో ఇది రీమేక్ అని తెలీయగానే అభిమానులంతా కాస్త నిరాశపడ్డ మాట నిజం.


యూఏఈ ఎడిటర్ ఉమైర్ సంధూ

యూఏఈ ఎడిటర్ ఉమైర్ సంధూ

అయితే యూకే, యూఏఈ సెన్సార్ బోర్డ్ సభ్యుడు, ఇండియన్ సినిమా మేగజైన్ యూకే అండ్ యూఏఈ ఎడిటర్ ఉమైర్ సంధూ.. పవన్ ఫ్యాన్స్‌కు ఓ రోజు ముందుగానే శుభవార్త చెప్పారు. కాటమరాయుడు గురించి తన ట్విటర్లో రివ్యూ పోస్ట్ చేశారు. కాటమరాయుడు గురించి మొట్టమొదటి రివ్యూ ఇదేనని చెబుతూనే సినిమా బ్లాక్‌బస్టర్ అని తేల్చేశారు.


కల్యాణ్, శృతిహసన్ కెమిస్ట్రీ

కల్యాణ్, శృతిహసన్ కెమిస్ట్రీ

సినిమా రివ్యూను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఆయన... పవన్ కల్యాణ్, శృతిహసన్ కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయిందన్నారు. సాంగ్స్ బాగున్నాయనీ, ఫైట్ స్టంట్స్ అదుర్స్ అని అభిప్రాయపడ్డారు. పైసా వసూల్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ అని తేల్చిచెప్పారు ఉమైర్ సంధూ.


4/5 రేటింగ్‌

4/5 రేటింగ్‌

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌తోపాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా అలరిస్తుందన్నారు. డైలాగ్స్ బాగున్నాయన్నారు. స్టోరీ ఏమీ కొత్తది కాకపోయినా.. చూసే వారికి ఆ అనుమానమే కలగకుండా స్క్రీన్‌ప్లే ద్వారా దర్శకుడు మెస్మరైజ్ చేశారన్నారు. మొత్తంగా ఈ సినిమాకు ఆయన 4/5 రేటింగ్‌ను ఇచ్చేసి ఫ్యాన్స్ సంబరాలకు కొంచం ముందుగానే తెరతీసారు.


సినిమా హిట్

సినిమా హిట్

అసలు ట్రైలర్ సమయం లోనే సినిమా హిట్ పై ఒక క్లారిటీ వచ్చేసింది. కాటమరాయుడు ట్రైలర్‌తో కాటమరాయుడుపైన ఉన్న అన్ని డౌట్స్‌కి సమాధానం ఇచ్చేశాడు పవన్. ‘నన్ను రెచ్చగొట్టకండ్రా...' అన్న డైలాగే చాలా వాటికి సమాధానం చెప్పేసింది. ఆ డైలాగ్‌తో పాటు ట్రైలర్‌లో ఉన్న ప్రతి షాట్ కూడా ఇంప్రెసివ్‌గా ఉంది.


80 శాతం భారం పవన్ భుజాలమీదే

80 శాతం భారం పవన్ భుజాలమీదే

ఎంతమందొచ్చారన్నది ముఖ్యం కాదు అన్న డైలాగ్ దగ్గరనుంచీ, హీరో ఇంట్రడక్షన్ సీన్ (వర్షం, గొడుగూ), ట్రైన్ ఫైట్ సీన్ ఇలా అన్నీ కాపీ పేస్ట్ లాగే కనిపిస్తున్నా ..వీరమ్ లో కథ నడిచిన తీరుకన్నా పూర్తి కొత్త మలుపులతో ఉంటుందనైతే చెప్తున్నారు. కానీ ఎన్ని మార్పులున్నా 80 శాతం భారం పవన్ భుజాలమీదే ఉంటుందన్నది కూడా నిజం.


ప్రతి డైలాగ్ కూడా బాగుంది

ప్రతి డైలాగ్ కూడా బాగుంది

మరీ ముఖ్యంగా పవన్ ఎంచుకున్న బ్యాక్ డ్రాప్ అయితే చాలా కొత్తగా ఉంది. పవన్ గెటప్‌ కూడా చాలా బాగుంది. అలాగే ట్రైలర్‌లో డాలీ మార్క్ కూడా చాలానే కనిపించింది. కాటమరాయుడులో ఉన్న ప్రతి డైలాగ్ కూడా బాగుంది. మరీ ముఖ్యంగా పవన్ నోటి వెంట వచ్చిన డైలాగులు అయితే అభిమానుల చేత విజిల్స్ కొట్టించేలా ఉన్నాయి.


సమాధానం చెప్పాడు

సమాధానం చెప్పాడు

‘రేయ్...కోపాన్ని...ఆయుధాన్ని ఎక్కడ వాడాలో తెలుసుకో' అన్న డైలాగ్ అయితే చాలా బాగుంది. ఇక సాంగ్స్ విషయంలో వచ్చిన విమర్శలన్నింటికీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో సమాధానం చెప్పాడు. ఇక ఇప్పుడు విడుదలకు ముందు ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో పవన్ చేసిన ప్రసంగం కూడా సినిమాకి మంచి ప్లస్ అని చెప్పుకోవచ్చు.


సర్దార్ గబ్బర్ సింగ్

సర్దార్ గబ్బర్ సింగ్

‘సర్దార్ గబ్బర్ సింగ్' నిరాశపరచడంతో పవన్ అభిమానులు ‘కాటమరాయుడు'పైనే ఆశలు పెట్టుకున్నారు. ‘గోపాలా గోపాలా' హిట్ అందించిన డాలీ కచ్చితంగా ‘కాటమరాయుడు'ని బాగా తీసుంటారని అభిమానులు అనుకుంటున్నారు. అయితే ‘కాటమరాయుడు'కి ఆధారమైన ‘వీరం' సినిమా ఇప్పటికే ‘వీరుడొక్కడే' పేరుతో తెలుగు డబ్ కావడం కొంత కలవరపెట్టే విషయం.


శుక్రవారం వరకు ఆగాల్సిందే

శుక్రవారం వరకు ఆగాల్సిందే

ఇప్పటికే ‘వీరుడొక్కడే' సినిమా చూసిన యాంటి ఫ్యాన్స్ ‘కాటమరాయుడి'పై బురద చల్లే అవకాశం కూడా ఉంది. కానీ ‘కాటమరాయుడు'ని మన ప్రాంతీయతకు తగ్గట్టు పూర్తిగా మార్చేసినట్లు సమాచారం. పక్కా ఫ్యాక్సనిస్టు కథకు లవ్ స్టోరీని జతచేసి డాలీ ‘కాటమరాయుడు'ని అద్భుతంగా తెరకెక్కించినట్లు ఫిల్మ్‌నగర్ టాక్. ఏదేమైనా సినిమా ఎలా ఉందో తెలియాలంటే శుక్రవారం వరకు ఆగాల్సిందే.


English summary
The review of Katamarayudu is out now and Here is the first review and rating of Katamarayudu by Umair Sandhu. "Pawan plays the good and the bad with ease and is a treat to watch on screen.The storyline may not be new for Tollywood cinema, but the director has tailor-made it for Pawan Kalyan and the mass audience." said Sandhu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu