Just In
- 1 hr ago
అందుకే ఆ టైటిల్ పెట్టాం.. ‘చెప్పినా ఎవరూ నమ్మరు’పై హీరో కమ్ డైరెక్టర్ కామెంట్స్
- 2 hrs ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు ముద్దులు.. లిప్ కిస్‌తో భర్తతో శ్రియ రచ్చ
- 2 hrs ago
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్‌కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- 2 hrs ago
శ్రీను వైట్ల ఓ శాడిస్ట్.. మంచు విష్ణు సెన్సేషనల్ కామెంట్స్
Don't Miss!
- News
394 మంది పోలీసులకు గాయాలు.. కొందరు ఐసీయూలో.. 19 మంది అరెస్ట్: ఢిల్లీ సీపీ
- Finance
ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 తక్కువకు బంగారం, ఫెడ్ పాలసీకి ముందు రూ.49,000 దిగువకు
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్‌ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌ను చేయండి: క్లార్క్
- Automobiles
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- Lifestyle
Study : గాలి కాలుష్యం వల్ల అబార్షన్లు పెరిగే ప్రమాదముందట...! బీకేర్ ఫుల్ లేడీస్...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
వివాదం , కేసు : ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ధియోటర్ లోకి వెళ్లి ఫ్యాన్స్ కట్టిన ఫ్లెక్సీల చించివేత
కడప: బాలకృష్ణ నటించిన 'గౌతమి పుత్ర శాతకర్ణి' రిలీజయ్యి మంచి హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కించిన 'గౌతమిపుత్ర శాతకర్ణి' సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం చూసిన ప్రముఖులు పలువురు క్రిష్ పైన, బాలకృష్ణపైన ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. అయితే ఊహించని సంఘటన మాత్రం కడపలో జరిగింది. కొందరు ఈ చిత్రం ఫ్లెక్సీలను చింపేసారు. గౌతమీపుత్ర శాతకర్ణి ఫ్లెక్సీలను పులివెందులలో గుర్తుతెలియని వ్యక్తులు చించేశారు. నంద మూరి ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు చేసిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. స్థానిక లక్ష్మి థియేటర్‌లో గురువారం నుంచి గౌతమీ పుత్ర శాతకర్ణి చిత్రం ప్రదర్శిస్తున్నారు. అర్ధరాత్రి సెకండ్ షో సినిమా ముగిసిన అనంతరం 1గంటకు గుర్తుతెలియని వ్యక్తులు థియేటర్‌లోకి చొరబడ్డారు. నందమూరి ఫ్యాన్స్ అసోసియేషన్, అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఇష్టమొచ్చినట్లు చింపేశారు. ఉదయం 7 గంటల కల్లా ఈ విషయం పట్టణంలో దావాలనంలా వ్యాపించింది.

వెంటనే నందమూరి ఫ్యాన్స సభ్యులు మహేష్, విజయ్‌కుమార్ రెడ్డి, యువకులు థియేటర్ వద్దకు తరలివచ్చారు. చింపిన ఫ్లెక్సీలను పరిశీలించి అక్కడి నుంచి ఏఎస్పీ అన్బురాజన్ ను కలిసి జరిగిన విషయాన్ని వివరించి కేసు నమోదు చేసి ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
స్పందించిన ఏఎస్పీ మాట్లాడుతూ ఇప్పటికే ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని దీనిపై ప్రత్యేకంగా విచారణ సాగిస్తున్నామన్నారు. సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నామన్నారు. ఫుటేజీల్లో చిత్రం సరిగా కనిపించ కపోవడంతో వీటిని హైదరాబాద్‌కు పంపిస్తున్నామన్నారు. ఈ విషయమై చుట్టుపక్కల వారిని విచారిస్తామన్నారు. థియేటర్ల యజమానులు రిలీజ్ అయిన సినిమాల విష యంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.
వాచమెన్ ను అనుక్షణం అప్రమత్తంగా ఉండేలా చూసుకోవాలన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని ఆయన వారికి హామీ ఇచ్చారు. అనంతరం అర్బన సీఐ ప్రసాద్‌ను కలిసి వారు వినతిపత్రం అందించారు. ఆయన కూడా ఈ ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
ఘటనపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యా ప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాలకృష్ణ ఫ్లెక్సీలు చింపడం నీచాతినీచమైన చర్య అని ఎవరు చేశారో అందరికీ బాగా తెలుసని శాసనమండలి డిప్యూటి చైర్మన్ సతీష్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇలాంటి సందర్భాలు పునరావృతమైతే తగి న మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు.