»   » పవన్ ప్లెక్సీలు ధ్వంసం...ప్రభాస్ ఫ్యాన్సే చేసారంటూ

పవన్ ప్లెక్సీలు ధ్వంసం...ప్రభాస్ ఫ్యాన్సే చేసారంటూ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో బుధవారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసంచేశారు. దీంతో రోడ్లపై పవన్ అభిమానులు ఆందోళనలు చేసి అనుమానితుల ఇళ్లపై రాళ్లతో దాడి చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇప్పటివరకూ అందిన వివరాలు...

పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ అభిమానులు ఆందోళన చేసారు. తమ అభిమాన హీరో ఫ్లెక్సీ చింపారంటీ బీభత్సం సృష్టించారు. పవన్ పుట్టిన రోజు సందర్బంగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఫ్యాన్స్ కట్టిన ఫ్లెక్సీ లను ఎవరో చింపేశారు. అయితే హీరో ఫ్రభాస్ అభిమానులే వాటిని చింపేశారంటూ ..పవన్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తూ ..ప్రభాస్ ఫ్రెక్సీలను చింపేసి, రోడ్డు మీద పడేసి నిప్పంచారు.

Flexis of Pawan destroyed; fans create ruckus in Bhimavaram

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

అంతేకాకుండా రోడ్డు ప్రక్కనున్న షాపులను కూడా ధ్వంసం చేసారు. విషయం తెలుసుకున్న పోలీసులు పవన్ ఫ్యాన్స్ కు నచ్చ చెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. రాత్రి సమయంలో రాస్తా రోకో చేసి...రోడ్డుపై నిప్పు పెట్టి హంగామా చేసారు. అనుమానితుల ఇళ్ళపై పవన్ అబిమానులు రాళ్ళతో దాడి చేసారు. వీరి ఆందోళనల ఎక్కడికి దారి తీస్తుందోనని ప్రజలు హడిలిపోయారు.

English summary
Tense situation prevailed at Bhimavaram in West Godavari district on Wednesday night.According to reports, some unidentified persons damaged flexis and banners of actor and Janasena chief Pawan Kalyan in Bhimavaram. The flexis were erected by Pawan fans to celebrate his birthday on Wednesday.
Please Wait while comments are loading...