»   » నిజమా? అన్నయ్య బర్త్ డేకి పవన్ కళ్యాణ్ గిఫ్ట్!

నిజమా? అన్నయ్య బర్త్ డేకి పవన్ కళ్యాణ్ గిఫ్ట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ అభిమానులు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ‘గబ్బర్ సింగ్-2' చిత్రం ఎట్టకేలకు ప్రారంభమైంది. మే 29 మహారాష్ట్రలోని మల్షెజ్ ఘాట్స్ ప్రాంతంలో షూటింగ్ ప్రారంభించారు. జూన్ 5తో తొలి షెడ్యూల్ పూర్తయింది కూడా. అయితే షూటింగులో ఇంకా పవన్ కళ్యాణ్ జాయిన్ కాలేదు.

రెండో షెడ్యూల్ ను జూలై మొదటి వారంలో ఆరంభిస్తారని, ఆ షూటింగులో పవన్ కళ్యాన్ జాయిన్ అవుతారని తెలుస్తోంది. మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ నంతా ఒక్కటి చేయాలనీ పవన్ తపిస్తున్నారని, అందులో భాగంగానే 'గబ్బర్ సింగ్-2' ఫస్ట్ లుక్ ను తన అన్నయ్య చిరంజీవి పుట్టినరోజయిన ఆగస్టు 22న విడుదల చేయాలనీ పవన్ భావిస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

Gabbar Singh 2 first look on August 22nd

ఇద్దరు హీరోయిన్స్ ఉండనున్న ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా అనీష అంబ్రోసేని ఎంపిక చేసారు. మరో హీరోయిన్ ఖరారు కావాల్సి ఉంది. ఆ ఫ్లాష్ బ్యాక్ లో పవన్ గెడ్డం పెంచుకుని కనపడతారని తెలుస్తోంది. ఆర్టిఫిషియల్ గెడ్డాలతో షూటింగ్ ఎందుకని, పవన్ తనే స్వయంగా గెడ్డం పెంచుకున్నారని సమాచారం. ఈ గెడ్డంతో వచ్చే ఎపిసోడ్ సినిమాలో హైలెట్ గా నిలువనుందని చెప్పుకుంటున్నారు. ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తోనే ...సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని అంటున్నారు.

బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గబ్బర్ సింగ్ -2 చిత్రానికి ‘సర్దార్' అన్న టైటిల్ ను ఖరారు చేసే ఆలోచనలో ఉన్నారు దర్శక-నిర్మాతలు... ఈ టైటిల్ పవన్ ఇమేజ్ కు సరిగ్గా సరిపోతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

English summary
The second schedule of Gabbar Singh 2 will kick start from July first week. According to the latest reports, we heard that the first look poster of Gabbar Singh 2 will be unveiled on Chiranjeevi’s birthday on August 22nd.
Please Wait while comments are loading...