»   »  ‘సర్దార్’ షూటింగులో పవన్ కళ్యాణ్ జాయినింగ్ డేట్

‘సర్దార్’ షూటింగులో పవన్ కళ్యాణ్ జాయినింగ్ డేట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘గబ్బర్ సింగ్-2' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈచిత్రానికి ఇటీవలే ‘సర్దార్' అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తుండగా, పవన్ కళ్యాణ్ స్నేహితుడు శరత్ మరార్ నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం షూటింగులో పాల్గొనలేదు. రెండో షెడ్యూల్ నుండి పవన్ కళ్యాణ్ షూటింగులో జాయిన్ కాబోతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జులై 29 నుండి సెకండ్ షెడ్యూల్ ప్రారంభం అవుతుందని, అందులో పవన్ కళ్యాణ్ జాయిన్ అవుతారని అంటున్నారు.

Gabbar Singh 2(Sardar) second schedule deatails

పవన్ కళ్యాణ్ సరసన అనీషా ఆంబ్రోస్ నటిస్తుందని అప్పట్లో ప్రచారం జరిగినా.... ఆమె ఇపుడు ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నారని తర్వాత తేలింది. హీరోయిన్ ఎవరు అనేది త్వరలో ప్రకటిస్తారట. సినిమా టైటిల్ గబ్బర్ సింగ్-2 టైటిల్ ‘సర్దార్' గా మార్చడం వెనక బలమైన కారణం ఉందటున్నారు. గబ్బర్ సింగ్ సీక్వెల్ అంటే వచ్చే క్రేజ్ సర్దార్ అంటే రాదని కొందరు సన్నిహితులు హెచ్చిరించినా పవన్ ఈ నిర్ణయం తీసుకున్నాడంటున్నారు. దానికి కారణం...లీగల్ గా టైటిల్ తో ఉన్న తలనొప్పులే అంటున్నారు.

గతంలో గబ్బర్ సింగ్ చిత్రం చేసేటప్పుడు ఆ టైటిల్ ని రిజిస్ట్రేషన్ చేసిన ముంబై వారు కోర్టుకు వెళ్లారు. తర్వాత డబ్బు ఇచ్చి సెటిల్ చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ అటువంటి తలనొప్పు ఎదురుకాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. సర్దార్ అన్నా బిజినెస్ అలాగే జరుగుతుందని, క్రేజ్ అలాగే ఉంటుందని పవన్ భావించినట్లు చెప్పుకుంటున్నారు.

English summary
Gabbar Singh 2 second schedule will start on the 29th of this month and Pawan himself will take part in the shooting.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu