»   »  గబ్బర్ సింగ్ -2 మొదలైందోచ్ : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి స్పెషల్ డే...

గబ్బర్ సింగ్ -2 మొదలైందోచ్ : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి స్పెషల్ డే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈ రోజు స్పెషల్ డే. ఎందుకంటే గత కొన్నేళ్లుగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న ‘గబ్బర్ సింగ్' సీక్వెల్ ‘గబ్బర్ సంగ్-2' ఈ రోజు(మే 29) ఎట్టకేలకు ప్రారంభం అయింది. మహారాష్ట్రలోని మల్సెజ్ ఘాట్ ప్రాంతంలో షూటింగ్ ప్రారంభం అయింది. పవర్ మూవీ ఫేం కెఎస్ రవీంద్ర(బాబీ) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

అంతా సవ్యంగా సాగితే వచ్చే ఏడాది సంక్రాంతి నాటికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో అనీషా అంబ్రోస్ హీరోయిన్ గా నటిస్తోంది. పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ శరత్ మరార్ ఈచిత్రాన్ని నార్త్ స్టార్ ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Gabbar Singh 2 shoot kick started from today

గబ్బర్ సింగ్ 2 లో ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందిట. ఆ ఫ్లాష్ బ్యాక్ లో పవన్ గెడ్డం పెంచుకుని కనపడతారని తెలుస్తోంది. ఆర్టిఫిషియల్ గెడ్డాలతో షూటింగ్ ఎందుకని, పవన్ తనే స్వయంగా గెడ్డం పెంచుకున్నారని సమాచారం. ఈ గెడ్డంతో వచ్చే ఎపిసోడ్ సినిమాలో హైలెట్ గా నిలువనుందని చెప్పుకుంటున్నారు. ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తోనే ...సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని అంటున్నారు.

గత కొద్ది రోజులుగా ఈ చిత్ర దర్శకుడు బాబీ, సినిమాటోగ్రాఫర్ జయనన్ విన్సెంట్ కలిసి ఈ సినిమా కోసం మహారాష్ట్రలో లొకేషన్స్ ని వెతికారు. ఈ ఫస్ట్ షెడ్యూల్ జూన్ 5తో ముగియనుందని టాక్. ఈ షెడ్యూల్ తర్వాత... మిగిలిన లాంగ్ షెడ్యూల్స్ ని ఈ చిత్ర టీం ప్లాన్ చేసుకోనుంది. ఇద్దరు హీరోయిన్స్ ఉండనున్న ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా అనీష అంబ్రోసేని ఎంపిక చేసారు. మరో హీరోయిన్ ఖరారు కావాల్సి ఉంది.

English summary
Power star Pawan Kalyan’s Gabbar Singh 2 shoot kick started from today (May 29th) in Pune. Power movie fame KS Ravindra is directing this movie.
Please Wait while comments are loading...