»   » పవన్ కళ్యాణ్ మళ్లీ అదే లొకేషన్ కోరుకుంటున్నాడట?

పవన్ కళ్యాణ్ మళ్లీ అదే లొకేషన్ కోరుకుంటున్నాడట?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ అభిమానులు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ‘గబ్బర్ సింగ్-2' చిత్రం ఎట్టకేలకు ప్రారంభమైంది. మే 29 మహారాష్ట్రలోని మల్షెజ్ ఘాట్స్ ప్రాంతంలో షూటింగ్ ప్రారంభించారు. జూన్ 5తో తొలి షెడ్యూల్ పూర్తయింది కూడా. అయితే షూటింగులో ఇంకా పవన్ కళ్యాణ్ జాయిన్ కాలేదు.

రెండో షెడ్యూల్ ను జూలై మొదటి వారంలో ఆరంభిస్తారని, ఆ షూటింగులో పవన్ కళ్యాన్ జాయిన్ అవుతారని తెలుస్తోంది. మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ నంతా ఒక్కటి చేయాలనీ పవన్ తపిస్తున్నారని, అందులో భాగంగానే 'గబ్బర్ సింగ్-2' ఫస్ట్ లుక్ ను తన అన్నయ్య చిరంజీవి పుట్టినరోజయిన ఆగస్టు 22న విడుదల చేయాలనీ పవన్ భావిస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

Gabbar Singh 2 shooting at Pawan's favorite location Kutch

కాగా...'గబ్బర్ సింగ్' సినిమాలోని ఇంట్రడక్షన్ సాంగ్ తో పాటు కొన్ని కీలక సన్నివేశాలను అప్పట్లో గుజరాత్ లోని కచ్ ప్రాంతంలో చిత్రీకరించారు. ఇప్పుడు 'గబ్బర్ సింగ్ -2' షూటింగ్ కూడా కొంత అక్కడే చేయాలని పవన్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈవిషయమై ఇంకా అఫీషియల్ సమాచారం లేదు.

ఇద్దరు హీరోయిన్స్ ఉండనున్న ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా అనీష అంబ్రోసేని ఎంపిక చేసారు. మరో హీరోయిన్ ఖరారు కావాల్సి ఉంది. ఆ ఫ్లాష్ బ్యాక్ లో పవన్ గెడ్డం పెంచుకుని కనపడతారని తెలుస్తోంది. ఆర్టిఫిషియల్ గెడ్డాలతో షూటింగ్ ఎందుకని, పవన్ తనే స్వయంగా గెడ్డం పెంచుకున్నారని సమాచారం. ఈ గెడ్డంతో వచ్చే ఎపిసోడ్ సినిమాలో హైలెట్ గా నిలువనుందని చెప్పుకుంటున్నారు. ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తోనే ...సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని అంటున్నారు.

English summary
Gabbar Singh 2 will soon go on regular schedule of shooting. Arrangements are being made for the next schedule in Gujarat. Remember Pawan’s introduction fight and title song of Gabbar Singh were also shot at Rann of Kutch in Gujarat.
Please Wait while comments are loading...