»   » అవునా? గబ్బర్ సింగ్-2 టైటిల్ మారుస్తున్నారంట!

అవునా? గబ్బర్ సింగ్-2 టైటిల్ మారుస్తున్నారంట!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ అభిమానులు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ‘గబ్బర్ సింగ్-2' చిత్రం ఎట్టకేలకు ప్రారంభమైంది. మే 29 మహారాష్ట్రలోని మల్షెజ్ ఘాట్స్ ప్రాంతంలో షూటింగ్ ప్రారంభించారు. జూన్ 5తో తొలి షెడ్యూల్ పూర్తయింది కూడా. అయితే షూటింగులో ఇంకా పవన్ కళ్యాణ్ జాయిన్ కాలేదు.

ఈ షెడ్యూల్ తర్వాత... మిగిలిన లాంగ్ షెడ్యూల్స్ ని ఈ చిత్ర టీం ప్లాన్ చేసుకోనుంది. ఇద్దరు హీరోయిన్స్ ఉండనున్న ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా అనీష అంబ్రోసేని ఎంపిక చేసారు. మరో హీరోయిన్ ఖరారు కావాల్సి ఉంది.

Gabbar Singh 2 title to be changed?

ఆ ఫ్లాష్ బ్యాక్ లో పవన్ గెడ్డం పెంచుకుని కనపడతారని తెలుస్తోంది. ఆర్టిఫిషియల్ గెడ్డాలతో షూటింగ్ ఎందుకని, పవన్ తనే స్వయంగా గెడ్డం పెంచుకున్నారని సమాచారం. ఈ గెడ్డంతో వచ్చే ఎపిసోడ్ సినిమాలో హైలెట్ గా నిలువనుందని చెప్పుకుంటున్నారు. ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తోనే ...సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని అంటున్నారు.

బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గబ్బర్ సింగ్ -2 చిత్రానికి ‘సర్దార్' అన్న టైటిల్ ను ఖరారు చేసే ఆలోచనలో ఉన్నారు దర్శక-నిర్మాతలు... ఈ టైటిల్ పవన్ ఇమేజ్ కు సరిగ్గా సరిపోతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

English summary
Film Nagar source said that, Pawan Kalyan's upcoming movie Gabbar Singh 2 title to be changed as Sardar.
Please Wait while comments are loading...