»   » 'గాయం-2' ధియోటర్ లో ప్రేక్షకులు దాడి..లాఠీ చార్జి

'గాయం-2' ధియోటర్ లో ప్రేక్షకులు దాడి..లాఠీ చార్జి

Posted By:
Subscribe to Filmibeat Telugu

జగపతిబాబు, విమలారామన్ కాంబినేషన్ లో రూపొందిన గాయం 2 చిత్రం నిన్న(శుక్రవారం) రిలీజైంది. అయితే ఈ చిత్ర ప్రదర్సనలో అనుకోని అవాంతరం ఎదురై ఊహించని ఉద్రిక్తతుకు దారితీసింది. హైదరాబాద్ అమీర్ పేటలోని బిగ్ సినిమా ధియోటర్ లో గాయం-2 సినిమా శుక్రవారం సెకెండ్ షో మధ్యలో నిలిచిపోవడంతో కోపోద్రిక్తులైన ప్రేక్షకులు దాడికి పాల్పడ్డారు. రాత్రి 10 గంటలకు ప్రారంభమైన సినిమా సాంకేతిక కారణాలతో 11 గంటల 23 నిముషాలకు గంటలకు నిలిచిపోయింది. గంట గడిచినా సినిమా తిరిగి ప్రదర్శించకపోవటంతో ప్రేక్షకులు సహనం కోల్పోయి ధియోటర్ లో ఫర్నిచర్ ను ధ్వసం చేసారు. దీంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు రంగంలోకి దిగి లాఠీ ఛార్జీ చేసి పరిస్ధితిని అదుపులోకి తెచ్చారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu