»   »  'గాయం' సీక్వెల్ డైరక్టర్?

'గాయం' సీక్వెల్ డైరక్టర్?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Gayam
తాజాగా జగపతిబాబు,రేవతి హీరో, హీరోయిన్లుగా వచ్చిన 'గాయం' సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నారనే విషయం తెలిసిందే. ఇప్పుడా సినిమాకు దర్శకుడని కన్ఫర్మ్ చేసారని తెలుస్తోంది. అప్పుడా సినిమా రామగోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందింది. ఇప్పుడు ఈ సీక్వెల్ సినిమాను ప్రవీణ్ అనే కొత్త డైరక్టర్ దర్శకత్వం వహించటానికి రెడీ అవుతున్నాడని తెలుస్తోంది.

అతను 'సోల్స్' అనే షార్ట్ ఫిలిం తీసి చిత్రపరిశ్రమలో అందరిచేతా ప్రశంసలు పొందాడు. అతను స్క్రిప్టు రెడీ చేసి జగపతిబాబు ని కలిస్తే ఆయన రామ్ గోపాల్ వర్మ వద్దకు పంపాడట. వర్మ కథ విని చాలా బాగుంది ...గో...ఎ హెడ్ అని చెప్పాడని తెలుస్తోంది. కథ ఇప్పుడు దుర్గా పాత్ర యోం చేస్తోందనే పాయింటు చుట్టూ తిర్గుతుందని తెలుస్తోంది. అలాగే జగపతిబాబు ఇప్పుడు వర్మ నిర్మించే 'రక్ష' అనే హర్రర్ చిత్రంలో చేస్తున్నాడు. ఆ సినిమా చేతబడి పై అల్లబడ్డ కథ. అంటే త్వరలో జగపతి మరో రెండు హిట్ల కి అంకురార్పణ జరుగుతోందన్నమాట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X