»   » నాని ‘జెంటిల్మెన్’ చాలా రిచ్‌గా తీసారు (ఫోటోస్)

నాని ‘జెంటిల్మెన్’ చాలా రిచ్‌గా తీసారు (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాని హీరోగా న‌టించిన తాజా చిత్రం జెంటిల్‌మ‌న్‌. సెన్సార్ పూర్త‌యిన ఈ చిత్రం ఈ నెల 17న విడుద‌ల కానుంది. మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్ర‌మిది. 'అష్టా చమ్మా' తర్వాత అంటే దాదాపు ఎనిమిదేళ్ల త‌ర్వాత నాని, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో రూపొందిన చిత్ర‌మిది.

'ఆదిత్య 369', 'వంశానికొక్కడు' వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించిన శ్రీదేవి మూవీస్ సంస్థ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో సురభి, నివేదా థామస్ కథానాయికలుగా న‌టించారు.


తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని స్టిల్స్ రిలీజ్ అయ్యాయి. సినిమా చాలా రిచ్ (నిర్మాణ విలువల పరంగా)గా తీసినట్లు స్పష్టమవుతోంది. సినిమాలో ఏ ముందో తెలియదు కానీ.... ఫోటోలు చూస్తుంటనే సినిమాపై అంచనాలు ఓ రేంజిలో పెరిగిపోతున్నాయి. నాని టాలెంట్ గురించి అందరికీ తెలిసిందే. పైగా హిట్ సినిమాలతో మంచి ఫాంలో ఉన్నాడు.


స్లైడ్ షోలో సినిమాకు సంబందించిన న్యూ ఫోటోస్, మరిన్ని వివరాలు...


నిర్మాత‌ శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ..

నిర్మాత‌ శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ..

‘మా చిత్రంలోని పాట‌ల‌కు, టీజ‌ర్‌కు, ట్రైల‌ర్‌కు చాలా మంచి స్పంద‌న వ‌స్తోంది. మా చిత్రం సెన్సార్ పూర్త‌యింది. క్లీన్ యు స‌ర్టిఫికెట్ వ‌చ్చింది. సినిమా చూసిన సెన్సార్ స‌భ్యులు చాలా మంచి సినిమా చేశామ‌ని మెచ్చుకున్నారు' అన్నారు.


స‌కుటుంబంగా చూడ‌ద‌గ్గ చిత్రం

స‌కుటుంబంగా చూడ‌ద‌గ్గ చిత్రం

ఈ చిత్రాన్ని ఫ్యామిలీ ప్రేక్షకులంతా కలిసి చూడదగ్గ చిత్రంగా తెరకెక్కించినట్లు తెలిపారు నిర్మాత.


రిలీజ్

రిలీజ్

ఈ నెల 17న చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నామని నిర్మాత తెలిపారు.


టైటిల్ లోనే సస్పెన్స్

టైటిల్ లోనే సస్పెన్స్

`జెంటిల్‌మ‌న్‌` అనే టైటిల్ ఎందుకు పెట్టామ‌న్న‌ది సినిమా చూస్తే తెలుస్తుంది. నాని ఇందులో విలనా? హీరోనా? అనేది ఆసక్తికరంగా ఉంటుందంటున్నారు.


మ‌ణిశ‌ర్మ

మ‌ణిశ‌ర్మ

మ‌ణిశ‌ర్మ అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు. రీరికార్డింగ్ కూడా హైలైట్‌గా ఉంటుంది. అంద‌మైన రొమాంటిక్ థ్రిల్ల‌ర్ ఇది. అన్ని ర‌కాల భావోద్వేగాలుంటాయి అని యూనిట్ సభ్యులు తెలిపారు.


నాని లుక్ సూపర్బ్

నాని లుక్ సూపర్బ్

సినిమాలో నాని లుక్ గత సినిమాల కంటే సూపర్బ్ గా ఉండబోతోంది.


మరో హిట్ ఖాయం

మరో హిట్ ఖాయం

ఆల్రెడీ భలే భలే మగాడివోయ్ సినిమాతో నాని హిట్ కొట్టాడు. ఈ సినిమా కూడా హిట్ అవ్వడం ఖాయం అంటున్నారు.


ప్రమోషన్స్

ప్రమోషన్స్

సినిమా విడుదలకు మరో వారం మాత్రమే టైం ఉండటంతో సినిమా ప్రమోషన్ల జోరు పెంచారు.


తారాగణం

తారాగణం

అవసరాల శ్రీనివాస్, తనికెళ్ల భరణి, వెన్నెల కిశోర్, ఆనంద్, రోహిణి, 'సత్యం' రాజేశ్, రమాప్రభ, ప్రగతి, రాజశ్రీ నాయర్, శ్రీముఖి తదితరులు నటించారు.


టెక్నీషియన్స్

టెక్నీషియన్స్

ఈ చిత్రానికి కథ: డేవిడ్ నాథన్, సంగీతం: మణిశర్మ, కెమేరా: పి.జి. విందా, ఆర్ట్: ఎస్. రవీందర్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేశ్, కో-డైరెక్టర్: కోట సురేశ్ కుమార్, స్ర్కీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.


English summary
Tollywood actor Nani's next movie Gentleman gets Clean U Certificate, film release on 17 June.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu