»   » వైభవంగా జరిగిన హీరో గోపీచంద్ నిశ్చితార్దం

వైభవంగా జరిగిన హీరో గోపీచంద్ నిశ్చితార్దం

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  హైదరాబాద్ : యాక్షన్ హీరో గోపీచంద్‌ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. మరో హీరో శ్రీకాంత్‌ అక్క కూతురు రేష్మాతో ఆయన వివాహం నిశ్చయమైంది. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లో గోపీచంద్‌, రేష్మాల నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు గోపీచంద్‌, శ్రీకాంత్‌ కుటుంబ సభ్యులు, బంధువులు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. మేలో వివాహం జరిపించడానికి పెద్దలు నిశ్చయించారు. త్వరలోనే పెళ్లి ముహూర్తాన్ని ఖరారు చేస్తారు. ఈ కార్యక్రమానికి ముత్యాల సుబ్బయ్య, బి.గోపాల్‌, పోకూరి బాబూరావు, వి.ఆనంద్‌ప్రసాద్‌ తదితరులు హాజరయ్యారు.

  ప్రస్తుతం గోపీచంద్‌..... చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. తాప్సీ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి 'జాక్‌పాట్‌' అనే పేరు పరిశీలిస్తున్నారు. నిధుల అన్వేషణ నేపథ్యంలో సాగే సినిమా ఇది. గోపీచంద్‌ సెక్యూరిటీ గార్డు పాత్రలో కనిపిస్తారని సమాచారం. ''విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకొంటోంది. యాక్షన్‌ ఘట్టాలు మాస్‌ని అలరిస్తాయి. లడక్‌, రాజస్థాన్‌, జోర్డాన్‌ల్లో చిత్రీకరణ జరిపాం'' అని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రంలో గోపీచంద్ ఎటిఎం సెంటర్ వద్ద సెక్యూరిటీ గార్డుగా కనపించనున్నాడని సమాచారం. మెకన్నాస్ గోల్డ్ తరహా కథాంసంతో గోపీచంద్ కెరీర్ లో నెంబర్ వన్ గా నిలవనుందని చెప్తున్నారు.

  చిత్ర దర్శకుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ- ప్రపంచంలోనే ప్రమాదకరమైన ఓ దేశం నుండి ఓ సామాన్యుడు సాహసోపేతంగా నిధిని ఎలా సాధించాడన్నదే ఈ చిత్రం కధాంశమని, అడ్వెంచరస్, యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందే ఈ చిత్రాన్ని జోర్డాన్, రాజస్థాన్, లడఖ్ తదితర ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నామని, ఈ కాలానికి తగ్గట్టుగా 'ట్రెజర్ హంట్' కథను సరికొత్తగా చిత్రంలో చూపిస్తామని, తాను ఇదివరకుచేసిన చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుందని తెలిపారు.

  హీరో గోపీచంద్ మాట్లాడుతూ..''చందు కథ చెప్పగానే చాలా ఉద్వేగానికి లోనయ్యాను. డబ్బు మనిషిని శాసిస్తున్న అంశం. ఈ కథ కూడా దాని చుట్టూనే తిరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ కథతో తేలిగ్గా ప్రయాణం చేయగలుగుతారు. కథ విని ఎంతో ఉద్వేగానికి లోనయ్యాను. కచ్ఛితంగా ప్రస్తుత పరిస్థితుల్లో ఇది భిన్నమైన కథ. సమాజంలో మనిషికీ, మనీకీ మధ్య చాలా లింకు ఉంది. అందుకే ఈ కథ అందరికీ కనెక్ట్ అవుతుంది'' అని చెప్పారు.


  నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ- ''గోపీచంద్, చంద్రశేఖర్ ఏలేటిలతో సినిమా చేయాలని చాలాకాలంగా అనుకుంటున్నాను. ఇన్నాళ్లకు కుదిరింది. చందు తయారు చేసిన స్క్రిప్ట్ గోపీచంద్‌కు చాలా బాగుంటుంది. భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మింస్తున్నాం'' అని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: ప్రశాంత్ అట్లూరి, సుమలత, కెమెరా: శామ్‌దత్, సంగీతం: శ్రీ, సహ నిర్మాత: భోగవల్లి బాపినీడు, సమర్పణ: రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్.

  English summary
  It’s time for Gopichand to end his bachelor life. Yes, he will be marrying a Hyderabadi girl Reshma who happens to be niece of hero Srikanth. The engagement take place on 23rd December in Hyderabad and the wedding will be held early 2013. Gopichand earlier got engaged to another girl Haritha but later the marriage was called off for reasons unknown after fixing the date.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more