»   » రాష్ట్ర పర్యటనలో ‘బాహుబలి-2’టెక్నికల్ టీమ్, ఎందుకోసం, ఏం చేస్తున్నారు?

రాష్ట్ర పర్యటనలో ‘బాహుబలి-2’టెక్నికల్ టీమ్, ఎందుకోసం, ఏం చేస్తున్నారు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'బాహుబలి-2' విడుదలకు సిద్దం అవుతున్న నేపథ్యంలో ఆ చిత్రం టెక్నికల్ టీమ్ రాష్ట్రమంతా పర్యటిస్తోంది. రీసెంట్ గా కాకినాడ ఈ టీమ్ చేరుకుంది. కాకినాడ లోని.. నాగమల్లితోట జంక్షన్‌ సమీపంలోని లాల్‌బహుద్దూర్‌ నగర్‌ మిర్చి రెస్టారెంట్‌లో విజువల్‌ రియాల్టీ ఎఫెక్ట్స్‌ను ప్రదర్శించారు.

బాహుబలి-2 చిత్రాన్ని విజువల్‌ రియాల్టీలో చూడడం ప్రేక్షకులకు కనువిందుగా ఉంటుందని 'బాహుబలి-2' చిత్రం సాంకేతిక నిపుణుడు కరుణాకరన్‌ చెప్పారు. చిత్రాన్ని మనం త్రీడీలో కూడా చూసే అవకాశం ఉన్నా దానికన్నా విజువల్‌ రియాల్టీలో చూసే విధంగా దీన్ని అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించినట్లు వివరించారు.

Grander plans forBaahubali VR Experience

బాహుబలి-2 చిత్రంలో ఉపయోగించిన అత్యాధునికమైన టెక్నాలజీని ప్రతి ఒక్కరికీ చూపించేలా తమ టీం సభ్యులు రాష్ట్రమంతా ప్రముఖ నగరాల్లో పర్యటిస్తున్నట్లు తెలిపారు. త్రీడీ చిత్రాల్లో మన దగ్గరకు చిత్రం వచ్చినట్లు ఉంటుందని, అదే విజువల్‌ రియాల్టీ (వీఆర్‌)లో మనమే చిత్రంలోని పాత్రల్లోకి వెళ్లి, వాటి అనుభూతిని పంచుకున్నట్లు ఉంటుందని కరుణాకరన్ చెప్పారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కరుణాకరన్‌ మాట్లాడుతూ.... చిత్రం ప్రచారంలో భాగంగా ప్రముఖ నగరాల్లో టెక్నికల్‌ సిబ్బంది ఆధ్వర్యంలో 56 సెకన్లతో కూడిన గ్రాఫిక్స్‌ను ప్రేక్షకులకు చూపిస్తున్నట్లు వివరించారు. బాహుబలి-2 చిత్రాన్ని విజువల్‌ రియాల్టీలో చూడడం ప్రేక్షకులకు కనువిందుగా ఉంటుందన్నారు.

దేశవ్యాప్తంగా 400 సెంటర్లలో బాహుబలి-2 విడుదల కానున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు విజయవాడ, గాజువాక, విశాఖపట్నం ప్రాంతాల్లో విజువల్‌ రియాల్టీ ఎఫెక్ట్స్‌ను ప్రదర్శించామని, ఇప్పుడు కాకినాడ, రాజమండ్రిల్లో ప్రదర్శిస్తున్నామని తెలిపారు.

ఇప్పటి వరకూ దేశంలో150 డిగ్రీలు మించని తెరలపైనే చిత్రాలను చూడగలిగామని, రానున్న రోజుల్లో 360 డిగ్రీల్లో ఈ చిత్రాన్ని చూసే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. అయితే ఇప్పటికిప్పుడు ఈ ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి థియేటర్లు తయారు చేయాలంటే భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని, అంతేకాక సమయం కూడా ఎక్కువగా ఉపయోగించాల్సి వస్తుందని అన్నారు. చిత్రం విడుదలకు ముందే 15 నిమిషాల నిడివిగల షార్టు ఫిల్మ్‌ను సెన్సార్‌ కెమెరా ద్వారా ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు.


ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో 'బాహుబలి: ది బిగినింగ్‌' చిత్రానికి కొనసాగింపుగా 'బాహుబలి: ది కన్‌క్లూజన్‌'ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విడుదల చేశారు. అక్టోబరు 23న ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా.. 22వ తేదీన తొలి ప్రచార చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

English summary
This second part of this Baahubali series has bigger and grander plans for its fans. It is all set to install virtual reality booths all across the country. Through these fans can enjoy experiences of being virtually present on the sets.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu