»   » జ్వ‌రంతో మిస్సయ్యా... 30 ఏళ్ల కెరీర్లో ‘గురు’ ప్రత్యేకం: వెంకటేష్

జ్వ‌రంతో మిస్సయ్యా... 30 ఏళ్ల కెరీర్లో ‘గురు’ ప్రత్యేకం: వెంకటేష్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వెంక‌టేష్, రితిక సింగ్ ప్ర‌ధాన తారాగ‌ణంగా వై నాట్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై సుధా కొంగ ప్ర‌సాద్ ద‌ర్శ‌క‌త్వంలో ఎస్‌.శ‌శికాంత్ నిర్మించిన చిత్రం గురు. ఈ సినిమా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది.

ఈ సందర్భంగా విక్ట‌రీ వెంక‌టేష్ మాట్లాడుతూ నా 30 ఏళ్ల కెరీర్లో 'గురు' సినిమా ఎంతో ప్రత్యేకం. నిజాయితీగా చెప్పాలంటే ఈ సినిమా పూర్తి చేసిన త‌ర్వాత నాలో నేను కొత్త న‌టుడుని చూశాను. ఇన్నేళ్ల కోరీర్లో ఎన్నో సినిమాలు చేసాను, ఈ జర్నీలో ఎన్నో విష‌యాలు నేర్చుకున్నాను. ఇన్నాళ్లు నేర్చుకున్న‌దంతా ఒక‌ఎత్తయితే 'గురు' సినిమా స‌మ‌యంలో నేర్చుకున్న‌ది ఒకఎత్తు అని వెంకటేష్ చెప్పుకొచ్చారు.

నేనే చేయాల్సింది, జ్వరంతో మిస్సయ్యా

నేనే చేయాల్సింది, జ్వరంతో మిస్సయ్యా

హిందీ, త‌మిళంలో రూపొందిన ఈచిత్రాన్ని ముందు నేనే చేయాల్సింది. కానీ అపుడు డెంగీ జ్వ‌రంతో చేయ‌లేక‌పోయాను. త‌మిళంలో విడుద‌ల కాక‌ముందే చూశాను. బాగా నచ్చడంతో వెంటనే చేద్దామని సుధ కొంగరతో చెప్పాను అని వెంకటేష్ తెలిపారు.

మొత్తం స్క్రిప్టు ఎప్పుడూ చదవలేదు

మొత్తం స్క్రిప్టు ఎప్పుడూ చదవలేదు

30 ఏళ్ల కెరీర్‌లో ఏ సినిమాకు పూర్తిగా స్ర్కిప్ట్‌ చదవలేదు. ఈ సినిమాకు మాత్రం నాచేత బౌండెడ్‌ స్ర్కిప్ట్‌ చదివించింది సుధ. తను అలా చేసిందో, తన ఆలోచన ఏంటో స్ర్కిప్ట్‌ మొత్తం చదివాక అర్ధమైంది. నాకు తెలియకుండానే నాలో ఎనర్జీ లెవల్స్‌ పెరిగాయి. ఈ కథకి ఇన్‌వాల్వ్‌ అయినట్లు మరే సినిమాకు కాలేదు... అని వెంకీ చెప్పుకొచ్చారు.

అవి ఎక్కడా రిపీట్ కాలేదు

అవి ఎక్కడా రిపీట్ కాలేదు

సుధ నా పాత సినిమాల‌న్నీ చూసి నా ముఖ క‌వ‌ళిక‌లు ఎక్క‌డా రిపీట్‌కాకుండా కొత్త‌గా ఉండేలా చూసుకుంది. ఈ సినిమాలో నేను బాక్సింగ్ కోచ్ అంటే గురువుగా ప‌నిచేశాను. కానీ సినిమా చేసే స‌మ‌యంలో సుధ, నాకు గురువు అయ్యింది. నా నుండి బెస్ట్ అవుట్ పుట్ తీసుకుంది. సినిమా చాలా బాగా వ‌చ్చింది అని వెంకీ తెలిపారు.

ఇకపై నా నుంచి ఇంకా కొత్త సినిమాలొస్తాయి

ఇకపై నా నుంచి ఇంకా కొత్త సినిమాలొస్తాయి

ఈ సినిమాలో జింగిడి సాంగ్ కూడా పాడాను. ట్యూన్ విన‌గానే ఎగ్జ‌యిట్ అయ్యాను. సంతోష్ నారాయ‌ణ్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమాతో నా ఆలోచ‌న కొత్త‌గా మారింది. కొత్త క్యారెక్ట‌ర్స్ ఏదైనా చేసేయ‌వ‌చ్చున‌నే ఫీలింగ్ వ‌చ్చింది. ఇకపై నా నుంచి ఇంకా కొత్త సినిమాలొస్తాయి అని వెంకటేష్ అన్నారు.

కథ కోసం 250 మంది బాక్స‌ర్స్‌ను, కోచ్‌ల‌ను క‌లిసాను

కథ కోసం 250 మంది బాక్స‌ర్స్‌ను, కోచ్‌ల‌ను క‌లిసాను

నేను మ‌ణిర‌త్నంగారి ద‌గ్గ‌ర అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్న స‌మ‌యంలో ఈ సినిమా ఐడియా వ‌చ్చింది. 2010లోనే ఈ క‌థ‌ను త‌యారు చేసుకోవాల‌నుకున్న‌ప్పుడు మూడు నాలుగేళ్ళు క‌థ‌పై రీసెర్చ్ చేశారు. 250 మంది బాక్స‌ర్స్‌ను, కోచ్‌ల‌ను క‌లిసి ఈ క‌థ‌ను త‌యారు చేసుకున్నాను అని దర్శకురాలు సుధ కొంగర తెలిపారు.

క‌థ త‌యారు కాగానే ముందు నేను క‌లిసింది వెంక‌టేష్‌గారినే

క‌థ త‌యారు కాగానే ముందు నేను క‌లిసింది వెంక‌టేష్‌గారినే

అ సమయంలో ఆయన డెంగీ ఫీవర్‌తో బాధపడుతుండటంతో చెయ్యలేకపోయారు. తమిళ్‌, హిందీలో సినిమా పూర్తి చేశాను. రిలీజ్‌కి ముందు ఆయనకి సినిమా చూపించా. ఆయనెంతో ఇంప్రెస్‌ అయ్యి ‘ఇప్పుడు నాతో తియ్యి' అన్నారు. గురు క్యారెక్టర్‌కి వెంకటేశ్‌ ఫర్ఫెక్ట్‌గా ఫిట్‌ అయ్యారు. తెలుగు ప్రేక్షకులు మెచ్చే సినిమా అవుతుంది'' అని దర్శకురాలు తెలిపారు.

వెంకీ కమిట్మెంట్ గురించి

వెంకీ కమిట్మెంట్ గురించి

నేను అసిస్టెంట్‌గా ఉన్న‌ప్పుడు నేను ఎంతో మంది స్టార్స్‌తో వ‌ర్క్ చేశాను. అయితే వెంక‌టేష్‌గారి వంటి క‌మిట్‌మెంట్‌, హ్యుమాలియాలిటీ, సిన్సియారిటీ చూడ‌లేదు. ఈ సినిమా మేకింగ్ వెంక‌టేష్‌గారు గాయ‌ప‌డినా దాని వ‌ల్ల షూటింగ్ ఎక్క‌డా ఆప‌లేదు. వెంక‌టేష్‌గారితో ప‌నిచేయ‌డం చాలా ఎగ్జ‌యిటింగ్‌గా అనిపించిందని తెలిపారు సుధ.

రితిక సింగ్, ముంతాజ్

రితిక సింగ్, ముంతాజ్

ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించిన రితిక సింగ్, ముంతాజ్ ల గురించి మాట్లాడుతూ...రితిక‌సింగ్ గ‌త ఆరేళ్ళుగా నాతో ట్రావెల్ అవుతుంది. తెలుగు, త‌మిళం, హిందీ అయినా చ‌క్క‌గా పెర్‌ఫార్మ్ చేసింది. ముంతాజ్ కూడా మంచి బాక్స‌ర్‌, రితిక‌, ముంతాజ్‌లు సిస్ట‌ర్స్‌గా న‌టించారు అని సుధ కొంగర తెలిపారు.

 నాన్న‌గారే నాకు రియ‌ల్ గురు

నాన్న‌గారే నాకు రియ‌ల్ గురు

రితిక సింగ్ మాట్లాడుతూ - ``తమిళం, హిందీ మాదిరిగానే తెలుగులోనూ ఈ సినిమా పెద్ద హిట్టవుతుంది. నిజ జీవితంలో నాన్న‌గారే నాకు రియ‌ల్ గురు. వెంక‌టేష్‌గారితో వ‌ర్క్ చేయడం ఎంతో కంఫ‌ర్ట్‌గా ఫీల‌య్యాను. ఈ సినిమాకు నాకు నేష‌న‌ల్ అవార్డ్ రావ‌డం ఎంతో హ్యాపీగా ఉంది అని తెలిపారు.

English summary
Victory Venkatesh’s Guru Movie Theatrical Trailer Launch event held at Hyderabad. Venkatesh, Ritika Singh, Sudha Kongara Prasad, Mumtaz Sorcar, S. Sashikanth graced the event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu