»   » ఘనంగా జీవి ప్రకాష్-సైంధవి వివాహం (ఫోటోలు)

ఘనంగా జీవి ప్రకాష్-సైంధవి వివాహం (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : అతి పిన్న వయసులోనే సంగీత దర్శకుడిగా మారి, పలువురు టాప్ స్టార్లతో పనిచేసే అవకాశం దక్కించుకుని సెన్నేషన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న జీవి ప్రకాష్ వివాహం అతని ప్రియురాలు సైంధవితో గురువారం ఉదయం చెన్నైలో అంగరంగ వైభవంగా జరిగింది.

వీరి వివాహానికి చెన్నైలోని మేయర్ రామనాథన్ చెట్టియార్ హాల్‌‌లో జరిగింది. హిందూ సాంప్రదాయ ప్రకారం తమిళనాడు స్టైల్‌లో వీరి వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకకు వధూవరుల బంధు మిత్రులు, స్నేహితులు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

అదే విధంగా ఈ రోజు సాయంత్రం 6 గంటలకు గ్రాండ్‌గా రిసెప్షన్ నిర్వహించనున్నారు. రిసెప్షన్‌కు సినీ రంగానికి చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు. రజనీకాంత్, కమల్ హాసన్, ఏఆర్ రెహ్మాన్, అజిత్ కుమార్, విక్రమ్, విజయ్, ఎఎల్ విజయ్, ధనుజయన్ గోవింద్, సూర్య, క్రాంతి, అనుష్క శెట్టి, త్రిష‌లతో పాటు తమిళ, తెలుగు, కన్నడ, మళయాలం సినీ రంగాలకు చెందిన ప్రముఖులు విచ్చేయనున్నారు.

జివి ప్రకాష్, సైంధవి వివాహం గురువారం ఉదయం చెన్నైలో వైభవంగా జరిగింది.

ప్రతి ఒక్కరి జీవితంలో ఇదో మరుపురాని క్షణం. హిందూ సాంప్రదాయం ప్రకారం అమ్మాయి మెడలో అబ్బాయి మూడు ముళ్లు వేసాడంటే వాళ్లు సాంప్రదాయ ప్రకారం ఏకమైనట్లే...

మాంగళ్యదారణ పూర్తికాగానే....పెద్దలంతా ఈ దంపతులను అక్షింతలు వేసి దంపతులుగా కలకాలం జీవించండి అని ఆశీర్వదిస్తున్న దృశ్యం.

పురోహితుడు చెప్పినట్లు సాంప్రదాయ బద్దమైన తంతు నిర్వహిస్తున్న దృశ్యం

ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది కలకాలం గుర్తుండి పోయే ఓ మధుర జ్ఞాపకం

తమిళ స్టార్ హీరో సూర్య జీవి ప్రకాష్-సైంధవి వివాహ వేడుకకు హాజరయ్యారైన దృశ్యం. సూర్య నటించిన పలు సినిమాలకు జీవి ప్రకాష్ సంగీతం అందించారు. ఇద్దరూ మంచి స్నేహితులు కూడా...

మణిరత్నం-సుహాసిని జివి ప్రకాష్-సైంధవి వివాహానికి హాజరైన దృశ్యం.

ప్రముఖ తమిళ దర్శకుడు బాల తన భార్య, కూతురుతో కలిసి జివి ప్రకాష్-సైంధవి వివాహ మహోత్సవానికి హాజరయ్యాడు.

జివి ప్రకాష్ పెళ్లికి హాజరైన తమిళ సినీ ప్రముఖులు....

జివి ప్రకాష్-సైంధవి ఎంగేజ్మెంట్ దృశ్యాన్ని ఇక్కడ వీక్షించవచ్చు. సాంప్రదాయ బద్దంగా వీరి ఎంగేజ్మెంట్ జరిగింది.

జివి ప్రకాష్, సైంధవి మధ్య స్కూల్ డేస్ నుంచి ప్రేమ వ్యవహారం మొదలైంది.

జివి ప్రకాష్ విషయానికి వస్తే... 19 ఏళ్లకే సంగీత దర్శకుడిగా పరిచయం అయి అతి చిన్న వయస్సులోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రజనీకాంత్ చిత్రం కథానాయకుడుకి కూడా ఇతనే సంగీతం అందించటం విశేషం.

సైంధవి విషయానికొస్తే తెలుగులో ఆమె మామిడి కొమ్మకి... (ఆవకాయ బిర్యాని), ఎలగెలగ(పరుగు) చిత్రాలుకు పాడింది. ఆమెకు తమిళనాడు ప్రభుత్వం ఉత్తమ గాయనిగా గతంలో సత్కరించింది కూడా.

English summary
A traditional Hindu wedding tamil music director G V Prakash Kumar tied knot with Singer Saindhavi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu