For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రక్తంతో ప్రేమలేఖలు...భయం : హన్సిక

  By Srikanya
  |
  హైదరాబాద్ : నాకు చాలా సార్లు రక్తంతో రాసిన ఉత్తరాలు వచ్చేవి. వాటిని చూసి చాలా భయమేసేది. తరవాత రాసిన వాళ్లమీద జాలేసేది. 'ఎప్పుడూ ఒకరికి పూర్తిగా లొంగిపోకూడదు. అలానే ఎవరినీ బాధపెట్టకూడదు' అన్నది అమ్మ తరచూ చెప్పే మాట. అందుకే వాళ్లందరికీ ఇష్టంలేదని సున్నితంగా చెప్పేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది హన్సిక. తన తాజా తమిళ చిత్రం డిల్లీ భెళ్లీ రిలీజ్ కు రెడీ అవుతున్న నేపధ్యంలో ఆమె మీడియాతో మాట్లాడింది.

  ఇలాగే... సినిమాల్లో నా నటనకూ, అందానికీ ప్రశంసలతో పాటూ కొన్ని రూమర్స్ వచ్చాయి. ఎక్కడ అమ్మ ఏమనుకుంటుందో అని నేను చాలా భయపడేదాన్ని. కానీ వాటి నుంచి ముందుగా తేరుకున్న అమ్మ 'నా హనీ వాళ్లకు రెండు, మూడేళ్ల నుంచే తెలుసు. కానీ నాకు పుట్టినప్పట్నుంచీ తెలుసు. ఎవరో ఏదో చెబితే నేనెలా నమ్ముతా' అంటూ నన్ను సముదాయించేది. మొదట్లో ఇద్దరం బాధపడేవాళ్లం. తరవాత పట్టించుకోవడం మానేశాం అంది.

  బెస్ట్‌ ఫ్రెండ్‌ అంటే కష్టసుఖాల్లో ఎప్పుడూ తోడుండే వాడు. కానీ అమ్మ కష్టాలను తను తీసుకొని సంతోషాలను నాకిచ్చింది. అందుకే 'బెస్ట్‌ ఫ్రెండ్‌' అన్న పదమూ తనకు తక్కువే అవుతుంది. తను గుర్తు రాగానే ముందు నా మొహంలో చిరునవ్వొస్తుంది. అప్పుడు తను పక్కన లేకపోతే మాత్రం ఏడుపొచ్చేస్తుంది. తనను నేను చాలా విషయాల్లో అనుకరించడానికి ప్రయత్నిస్తా. ముఖ్యంగా ప్లానింగ్‌లో. కానీ ఇప్పటికీ ఆ విషయంలో తనే బెస్ట్‌. ప్లానింగ్‌ ఒకరిని చూసి నేర్చుకుంటే వచ్చేది కాదని అర్థమైంది. అప్పటి నుంచి తన దారినే ఫాలో అయిపోతున్నా అంటూ తన తల్లిపై ఉన్న ప్రేమను వ్యక్తం చేసింది.

  ఇక నా బట్టలూ, చెప్పులే కాదు.. నాకెలాంటి సినిమాలు నప్పుతాయో కూడా అమ్మకు బాగా తెలుసు. అందుకే ప్రతి కథనూ తను విని, ఆ పాత్రలో నేనెలా ఉంటానో వూహించుకునేది. సరిపోతానని తనకు నమ్మకం కలిగాకే నేను సినిమా ఒప్పుకునేది. ప్రపంచంలో అందరి కన్నా ఎక్కువగా నా నటనను విమర్శించేది అమ్మే. మస్కా, బిల్లా, కంత్రీ, కందిరీగ, దేనికైనా రెడీ... సినిమా ఏదయినా, ఎంత పెద్ద హిట్టయినా 'ఫలానా సీన్లో నువ్వస్సలు బాగా చేయలేదు' అని నిర్మొహమాటంగా చెప్పేస్తుంది. ఎక్కడ నాకు గర్వం పెరిగిపోతుందో అని తన భయం. అయితే అపజయాలు వచ్చినప్పుడు మాత్రం నేను నిరాశపడకుండా ఉత్సాహంగా మాట్లాడుతుంది. 'నువ్వు బాగానే చేశావు. కానీ సినిమా అంటే నువ్వొక్కదానివే కాదు కదా' అంటుంది. నిజానికి సినిమా ఫ్లాప్‌ అయినప్పుడు తను నాకంటే ఎక్కువ బాధపడుతుంది అంది.

  English summary
  
 Hansika says... "My mom is amazing. She’s always been there for me".
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X