»   » హన్సిక క్యూట్ కిస్: చిరకాల కోరిక తీరిందంటూ...

హన్సిక క్యూట్ కిస్: చిరకాల కోరిక తీరిందంటూ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ హన్సిక ప్రస్తుతం హాలిడే వెకేషన్లో ఉంది. వరుసగా 8 నెలల పాటు గ్యాప్ లేకుండా పని చేసిన హన్సిక తన బెస్ట్ ఫ్రెండుతో కలిసి విదేశాల్లో గడుపుతోంది. ఈ ట్రిప్పులో తన అనుభవాలను ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకుంటోంది. డాల్ఫిన్ ను ముద్దాడాలని హన్సిక ఎప్పటి నుండో అనుకుంటోంది. ఎట్టకేలకు ఈ ట్రిప్పులో అది సాధ్యమైంది. అందుకు సంబంధించిన ఫోటోను ఆమె తన మైక్రో బ్లాగింగ్ లో షేర్ చేసింది.

ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఓ వైపు విదేశాల్లో హన్సిక హాలిడే వెకేషన్ ఎంజాయ్ చేస్తుంటే....ఆమెపై ఇక్కడ కొన్ని వివాదాస్పద విషయాలు ప్రచారంలోకి వచ్చాయి. ఓ బాత్రూం వీడియో అంతర్జాలంలో హల్ చల్ చేస్తోంది. హన్సిక స్నానం చేస్తుండగా రహస్యంగా చిత్రీకరించినట్లు ఈ వీడియో ఉంది. అయితే ఇందులో ఉంది నిజంగానే హన్సికనా? లేక ఎవరైనా ఆమె ఫేసుతో దీన్ని మార్పింగ్ చేసారా? అనేది తేలాల్సి ఉంది. విషయమై అభిమానులు కలవర పడుతున్నారు.

Hansika Kiss to Dolphin

ఆ మధ్య త్రిషకు సంబంధించిన బాత్రూం వీడియో పెద్ద సంచలనమే సృష్టించింది. అయితే అందులో ఉంది తాను కాదని త్రిష మీడియా ముఖంగా ప్రకటించింది. ఇటీవల లెజెండ్ హీరోయిన్ రాధిక ఆప్టేకు సంబంధించిన న్యూడ్ ఫోటోలు కూడా ఇంటర్నెట్లోలీక్ అయ్యాయి. అయితే అందులో ఉంది తాను కాదని తేల్చింది రాధిక.

హన్సిక సినిమాల విషయానికొస్తే....తెలుగులో చివరగా ‘పవర్' చిత్రంలో నటించిన హన్సిక మళ్లీ ఇక్కడ ఏ సినిమాకు కమిట్ కాలేదు. అయితే తమిళంలో మాత్రం అమ్మడు మహా బిజీ. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను తమిళ చిత్రాలు ఉన్నాయి. తమిళ స్టార్ హీరోలందరూ హన్సికతో చేయడానికే ఆసక్తి చూపుతున్నారు.

English summary
Hansika is all smiles as she managed to fulfill her long-lasting wish - kissing a Dolphin. Sharing the photo, she wrote on her micro-blogging page, "The most amazing part of my trip.Kissing the Dolphins one of my most memorable experience. One tick on my bucket list and also the reason of my trip."
Please Wait while comments are loading...