Just In
Don't Miss!
- Sports
Syed Mushtaq Ali Trophy 2021: నాకౌట్ షెడ్యూల్ ఇదే
- Lifestyle
మీరు ఉదయాన్నే ఫోన్ చూస్తుంటారా? అయితే మీరు ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే...
- News
కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడు -ఎన్నికను ఖరారు చేసిన CWC -భేటీలో తీవ్రవాగ్వాదం
- Finance
మార్కెట్ భారీ పతనం, సెన్సెక్స్ 746 పాయింట్లు డౌన్: రిలయన్స్ మళ్లీ..
- Automobiles
భారతదేశంలో టాప్ 10 ఎలక్ట్రిక్ టూవీలర్ బ్రాండ్స్ ఇవే..
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ముద్దు సీన్లు: బ్యాక్టీరియా సోకుతుందని హన్సిక భయం!
హైదరాబాద్: ఈ మధ్య దక్షిణాది సినిమాల్లో కూడా ముద్దు సీన్లు సర్వ సాధారణం అయిపోయాయి. ఇప్పటికే సౌత్ లో నయనతార, అనుష్క, కాజల్ లాంటి హీరోయిన్లు ముద్దు సీన్లతో తెరను వేడెక్కించారు. అయితే హీరోయిన్ హన్సిక మాత్రం లిప్ లాక్ ముద్దు సీన్లకు ససేమిరా అంటోంది.
సీన్ డిమాండ్ చేస్తే ఇలాంటి సీన్లు చేయడానికి ఇబ్బందేమీ లేదు కానీ..... లిప్ లాక్ ముద్దు సీన్ వల్ల అనారోగ్యకారకమైన బ్యాక్టీరియా ఒకరి నుండి మరొకరికి ట్రాన్ఫర్ అవుతాయి. అందుకే ఇలాంటి సీన్లు చేయడానికి నేను ఒప్పుకోను అని అంటోంది. ఈ మధ్య ప్రముఖ అంతర్జాతీయ పత్రికల్లోనూ ముద్దు వల్ల బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుందనే కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే.

ఇలాంటి బ్యాక్టీరియా వల్ల ఒక్కోసారి ప్రమాదకరమైన వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది. ఈ విషయాలు తెలిసినప్పటి నుండి హన్సిక చాలా భయపడుతోంది. అయితే హన్సిక ఇలాంటి నియమాలకు కట్టుబడి ఉంటే కొన్ని ‘ముద్దు సీన్లు' తప్పనిసరి అయ్యే సినిమాలు చేజార్చుకోవాల్సి ఉంటుందని సినీ విశ్లేషకుల మాట.
హన్సిక సినిమాల విషయానికొస్తే....హన్సిక తెలుగులో గతేడాది ‘బలుపు' చిత్రంలో నటించింది. ఆ తర్వాత ఆమె తెలుగు సినిమాలేవీ కమిట్ కాలేదు. ప్రస్తుతం 7 తమిళ చిత్రాల్లో నటిస్తోంది. అందులో ఐదు చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతుండగా మరో రెండు చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి.