For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పవన్ కళ్యాణ్ శీలాన్ని శంకించొద్దంటూ దర్శకుడి హాట్ కామెంట్!

  |

  'నా ఆలోచన' పేరుతో వర్దమాన అంశాలను విశ్లేషిస్తూ తనదైన అభిప్రాయాలు వెల్లడించే తమ్మారెడ్డి భరద్వాజ తాజాగా పవన్ కళ్యాణ్ గురించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఆయన తన తాజా వీడియోలో 1979 నాటి ఇండో-పాక్ అంశాలతో మొదలు పెట్టి.... చివరకు పవన్ కళ్యాణ్ శీలాన్ని శంకించాల్సిన పని లేదు అంటూ కంక్లూజన్ ఇవ్వడం అభిమానులను ఆకట్టుకుంటోంది.

  ఒకప్పుడు పవన్ కళ్యాణ్‌ను కొన్ని విషయాల్లో తప్పుబట్టిన తమ్మారెడ్డి ఇపుడు ఆయనకు మద్దతుగా మాట్లాడటం వెనక కారణం ఏమిటి? అసలు ఆయన ఏం చెప్పారు? ఓ లుక్కేద్దాం...

  1971 ఇండో-పాక్ వార్

  1971 ఇండో-పాక్ వార్

  1971 ఇండో పాక్ వార్ జరిగింది. దాంట్లో బ్రిగేడియర్ కులదీప్ సింగ్ చందాపూరి ఫైట్ చేశారు. నాలుగు వేల మంది పాకిస్థాన్ సోల్జర్స్, 45 ట్యాంకర్లు యుద్ధంలో పాల్గొన్నాయి. మన వాళ్లు 120 మంది సోల్జర్స్ ఒక జీపు మాత్రమే. ఆ యుద్ధంలో బ్రిగేడియర్ కులదీప్ సింగ్ ఆధ్వర్యంలో 2వేల మంది పాకిస్థాన్ సైనికులను చంపేశారు. 36 ట్యాంకులు విచ్చిన్నం చేశారు. 500 ఇతర వాహనాలను నాశనం చేశారు. ఈ 120 మందికి హెచ్ఎఫ్ 24 బాంబర్ సపోర్ట్ ఇచ్చింది. మనవాళ్లు యుద్ధాన్ని గెలిచారు.

  తమిళులకు అహంభావం ఎక్కువ, చచ్చినా ఆ పని చేయరు.. అలాంటిది రాజమౌళి గురించి!

  అలాంటి వారిని మరిచిపోతున్నాం

  అలాంటి వారిని మరిచిపోతున్నాం

  ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే... ఇపుడు యుద్ధానికి ఎయిర్ ఫైటర్స్ లేవని, మనం నిర్వీర్యం అయిపోతున్నామని, అందుకే రాఫెల్ డీల్ చేసుకున్నామని అంటున్నారు. హిందూస్థాన్ ఫైటర్ 24(హెచ్ఎఫ్ 24) మన దగ్గర తయారైన విమానం. దాంతోనే యుద్ధం గెలిచాం. ఇపుడు మనకు యుద్ధాలు వస్తాయో రావో తెలియదు కానీ యుద్ధం కోసమే రాఫెల్ డీల్ అని చెప్పి 50 వేల కోట్ల స్కాం చేశారు. 120 మందితో సామ్రాజ్యాన్ని గెలిచిన బ్రిగేడియర్ కులదీప్ సింగ్ లాంటి వారి గురించి మనమంతా మరిచిపోతున్నాం.

  ప్రతి వాడినీ దేశ ద్రోహి అనడం ఫ్యాషన్ అయిపోయింది

  ప్రతి వాడినీ దేశ ద్రోహి అనడం ఫ్యాషన్ అయిపోయింది

  డబ్బులు సంపాదించడానికి, స్కాములు చేయడం కోసం, వ్యాపారాలు చేయడం కోసం ఆర్మీని వాడుకునే స్టేజీకి మనం వెళ్లిపోయాం. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎంతకాలం ఈ లంచగొండితనం, స్కాములు భరిస్తూ ఉండాలి. మనం దీన్ని స్కాము అనగానే దోశ ద్రోహుల కింద మనల్ని లెక్కవేస్తున్నారు. ఎందుకు మనకు యుద్ధ విమానాలు అంటే మన దేశాన్ని పాకిస్థాన్, చైనా కబ్జా చేయాలా? నువ్వు చైనా ఏజెంటువా? పాకిస్థాన్ ఏజెంటువా? అని అడుగుతూ ఉంటారు. ఇటువంటివన్నీ మానేసి మన దేశం గురించి, మన గురించి మాట్లాడుకున్న రోజున మన దేశం బాగుపడుతుంది. ప్రతి వాడినీ దేశ ద్రోహి అనడం ఫ్యాషన్ అయిపోయింది. ఎవరు ద్రోహి? ఎవరు కాదు? అని మాట్లాడుకోవాలంటే టైమే చాలదు.

  అలా ప్రశ్నించడం మనల్ని మనం చులకన చేసుకోవడమే

  అలా ప్రశ్నించడం మనల్ని మనం చులకన చేసుకోవడమే

  కొంత మంది భారత్ మాతాకీ జై అనమంటారు. అలా అనకంటే నీకు దేశం మీద భక్తి లేదని నింద వేస్తారు. ఎందుకు అనాలి? అంటేనే దేశ భక్తి ఉన్నట్లా? నా దేశం మీద నాకు భక్తి ఉండదా? ఇలాంటి డిమాండ్లు మనల్ని మనం చులకన చేసుకోవడం తప్ప ఏమీ లేదు.

   పవన్ వేసిన ప్రశ్న ఆసక్తిగా అనిపించింది

  పవన్ వేసిన ప్రశ్న ఆసక్తిగా అనిపించింది

  ఇవన్నీ చెప్పడానికి కారణం పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు గుర్తు చేయడానికే. పవన్ క ళ్యాణ్‌ను తెలుగు దేశం వాళ్లో, ఇంకో పార్టీ వాళ్లో.. నా బోటి వాళ్లో ఈయనెందుకండీ బీజేపీ గురించి మాట్లాడడు అని చాలా సార్లు అంటూ ఉంటారు. నేను కూడా గతంలో ఈ మాట అన్నాను. బీజేపీతో కుమ్మక్కయ్యారా? అని గతంలో ఎవరో అన్న విషయాన్ని నేను ఉటంకించాను. కానీ ఈ రోజు పవన్ లేవనెత్తిన ఓ అంశం ఇంట్రెస్టింగ్ అనిపించింది.

   పవన్ ఏం ప్రశ్నించారంటే..

  పవన్ ఏం ప్రశ్నించారంటే..

  బీజేపీ రామ మందిరాన్ని వాళ్ల అవసరం కోసం వాడుకుంటోందా? అని పవన్ కళ్యాణ్ ఓ ప్రశ్న వేశారు. చాలా తక్కువ సమయంలో బాబ్రీ మసీదు కూలగొట్టారు. టెంపుల్ కడతాం అంటున్నారు కానీ మూడు ఎలక్షన్లు అయినా ప్రతి సారి ఆ అంశాన్ని అడ్డం పెట్టుకుని గెలుస్తున్నారే తప్ప కట్టడం లేదు. కట్టాలనకుంటే కట్టండి, లేకుంటే మానేయండి. దాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం ఎంత వరకు కరెక్ట్ అని పవన్ ప్రశ్నించారు.

  పవన్ కళ్యాన్ శీలాన్ని శంకించొద్దు

  పవన్ కళ్యాన్ శీలాన్ని శంకించొద్దు

  పవన్ చెప్పింది నిజమే. సర్దార్ పటేల్ విగ్రహం కోసం 3 వేల కోట్లు పెట్టి వెంటనే కట్టేశారు. కేరళలో అంత పెద్ద వరదలు వస్తే, శ్రీకాకుళంలో వస్తే రూపాయి లేదన్నారు. కానీ మూడు వేల కోట్లు పెట్టి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం కట్టారు. అదే రామాలయం కట్టడానికి 20 ఏళ్ల నుంచీ వారి వల్ల కావడం లేదు. ఈ నాలుగున్నరేళ్లలో పునాది రాయి కూడా లేకుండా ఉంది. ఇపుడు కూడా ఆలోచిస్తారంట.. నెక్ట్స్ ఎలక్షన్ గెలిపిస్తే కడతారంట. ఇది పవన్ కళ్యాణ్ గారు అడిగారు. దీన్ని బట్టి బీజేపీ విషయంలో పవన్ కళ్యాణ్ శీలాన్ని శంకించే అససరం లేదు. బీజేపీతో కుమ్మక్కయితే ఆయన ఈ మాట అనరు కదా. ఏ రాజకీయ పార్టీ అనని మాట పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన అలా అనడం చాలా సంతోషం వేసింది.

  వారిని మరిచిపోవద్దు

  వారిని మరిచిపోవద్దు

  పవన్ కళ్యాణ్ అన్న మాటకు ముచ్చటేసి ఈ విషయం ప్రేక్షకులతో పంచుకోవాలనుకున్నాను. అలాగే కులదీప్ సింగ్ లాంటి గొప్ప వ్యక్తులను గుర్తు చేసుకోవాలి. ఆధునిక విమానాలు ఉన్నా లేకున్నా మన యుద్ధ నైపుణ్యత ఎలాంటిదో గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ ప్రభుత్వం వచ్చినా దేశాభివృద్ది గురించి ఆలోచించాలి అని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు.

  English summary
  Hats Off To PAWAN KALYAN says Tollywood Veteran Director Tammareddy Bharadwaj and he made few shocking comments on BJP Party. Finally, he praises an Indian Army officer Kuldip Singh Chandpuri the heroic 'Border' man who defied Pakistani tanks.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X