»   » దళితులకు వ్యతికేమంటూ సినిమాని..

దళితులకు వ్యతికేమంటూ సినిమాని..

Posted By:
Subscribe to Filmibeat Telugu

రిజర్వేషన్లు కథాంశంగా తె రకెక్కిన చిత్రం 'ఆరక్షణ్" ప్రదర్శనకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ముంబైతోపాటు రాష్టవ్య్రాప్తంగా ఈ సినిమా ప్రదర్శించేందుకు మార్గం సుగమమైంది. సినిమాను విడుదల చేసేముందే తమకు చూపించాలన్న కొందరి వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ చిత్రంలో దళితులకు వ్యతిరేకంగా కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని ఆరోపిస్తూ ఆర్పీఐ అధినేత రాందాస్ అథవాలే, ఎన్సీపీనేత ఛగన్‌భుజ్‌బల్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తదితరులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ చిత్రాన్ని విడుదల కానీయబోమని, ఒకవేళ విడుదలైనా దానిని ప్రదర్శనను అడ్డుకుంటామని ప్రకటించారు. అయితే సినిమా విడుదలపై స్టే విధించాలని కోరుతూ కొందరు కోర్టుకెక్కారు. దీంతో కేసును విచారణకు స్వీకరించిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని కూడా ఈ విషయమై వివరణ కోరింది. హోంశాఖ కార్యదర్శి నుంచి వివరణ వచ్చాక దానిని పరిశీలించిన కోర్టు సినిమాను ప్రదర్శించేందుకు అనుమతినస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రకాష్ ఝా తెరకెక్కించగా అమితాబ్, సైఫ్ అలీఖాన్, దీపికా పదుకొనె తదితరులు ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు.

English summary
The Bombay high court on Tuesday paved the way for the Aarakshan film's release when it rejected two lawyers' plea, seeking a special pre-release screening and also a ban on it as they anticipated "law-and order problem".
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu