»   » పూరి పైత్యం....‘హార్ట్ ఎటాక్’ పెద్దలకు మాత్రమే!

పూరి పైత్యం....‘హార్ట్ ఎటాక్’ పెద్దలకు మాత్రమే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పూరి జగన్నాథ్ సినిమాల్లో హీరో పోరికి వేషాలు, అమ్మాయిలను ఆట పట్టించడం, ప్రేమ పేరుతో వేధించడం లాంటి సన్నివేశాల ఉంటాయని, ఇలాంటి వాటి వల్ల యువతలోకి తప్పుడు సంకేతాలు వెలుతున్నాయని అనేక సార్లు మహిళా సంఘాలు గగ్గోలు పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా విడుదలకు సిద్ధమైన ఆయన మరో సినిమా 'హార్ట్ ఎటాక్' చిత్రానికి సెన్సార్ బోర్డు వారు ఇది పెద్దలు మాత్రమే చూడదగిన సినిమా అని 'A' సర్టిఫికెట్ జారీ చేయడం చర్చనీయాంశం అయింది.

ప్రేమ కథా చిత్రంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఆడియో, ప్రోమోలు చూస్తే సినిమాలో ఎలాంటి సన్నివేశాలు చూడబోతున్నామో స్పష్టమైంది. దీనికి తోడు తాజాగా సెన్సార్ నుండి 'A' సర్టిఫికెట్ కూడా జారీ కావడంతో.....పూరి తన పైత్యాన్నంతా ఈ సినిమాలో చూపించబోతున్నారని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

నితిన్, ఆదా శర్మ జంటగానటిస్తున్న ఈచిత్రంలో నితిన్‌ని ఓ పోకిరి ప్రేమికుడిగా చూపించబోతున్నారు. తొలిసారిగా నితిన్, పూరి దర్శకత్వంలో నటించటంపై మంచి అంచానాలే ఉన్నాయి. ఈ చిత్రం ఈ నెల 31న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. పూరి జగన్నాధ్ తన సొంత బ్యానర్ అయిన పూరి టూరింగ్ టాకీస్ బ్యానర్ పై ఈ మూవీని నిర్మించాడు.

నిర్మాత మాట్లాడుతూ... ''మాస్‌, క్లాస్‌ అంశాలు మేళవించిన ప్రేమ కథ ఇది. నితిన్‌ గెటప్‌, ఆయన పాత్ర చిత్రణ ఆకట్టుకొంటాయి. స్పెయిన్‌లో చిత్రీకరించిన సన్నివేశాలు ఆకర్షణగా నిలుస్తాయి. అనూప్‌ రూబెన్స్‌ అందించిన పాటలు యువతరాన్ని అలరిస్తాయనే నమ్మకం ఉంది'' అని చెప్తున్నారు.

ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ లీడింగ్ టెలివిజన్ ఛానెల్ జెమినీ వారు పొందినట్లు తెలుస్తోంది. నాలుగున్నర కోట్ల రూపాయలకు ఈ రైట్స్ ని సొంతం చేసుకున్నట్లు సమాచారం. పూరీ దర్శకుడు కావటం, వరస హిట్స్ లో ఉన్న నితిన్ హీరో కావటంతో ఈ రేంజి రేటు పలికినట్లు చెప్తున్నారు.

English summary
Nitin’s ‘Heart Attack’ has received an A certificate from the censor board. The formalities have been completed today and the movie is getting ready for a big release on the 31st.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu