»   » 'మహాత్మ' నుండి దొంగ గా శ్రీకాంత్

'మహాత్మ' నుండి దొంగ గా శ్రీకాంత్

Posted By:
Subscribe to Filmibeat Telugu

శ్రీకాంత్ తో కృష్ణవంశీ దర్శకత్వంలో 'మహాత్మ' చిత్రాన్ని నిర్మించిన సి.ఆర్.మనోహర్ నాయుడు ఈ సారి మరో చిత్రాన్ని అదే హీరోగా నిర్మిస్తున్నారు. ఆ చిత్రం టైటిల్ 'రంగా.. ది దొంగ'. నటుడు, దర్శకుడు జి.వి. దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. గోల్డెన్ లైన్ ఫిలిమ్స్, గాడ్ ఫాదర్ ఫిలిమ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'స్టోరీ ఆఫ్ ఎ థీఫ్' అనే ట్యాగ్‌లైన్‌తో రూపుదిద్దుకునే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని జి.వి. చెప్పారు. జి.వి. గతంలో నితిన్ తో హీరో అనే చిత్రం రూపొందించారు. అయితే అది భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకుంది. ఇక శ్రీకాంత్ మరో చిత్రాన్ని కూడా కమిట్ అయ్యారు.

శ్రీకాంత్ హీరోగా సముద్ర దర్శకత్వంలో శ్రీమహా గణపతి ఫిలిమ్స్ పతాకంపై ఎం.సుధాకర్ 'సేవకుడు' పేరుతో ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఈ నిర్మాతలు గతంలో శ్రీకాంత్ హీరోగా 'తారకరాముడు', 'మనసిస్తారా' చిత్రాలు నిర్మించారు. అలాగే ఈ చిత్రంలో విమలారామన్ హీరోయిన్ గా చేస్తోంది. ఈ సినిమాలో నాజర్ కీలక పాత్రను పోషించనున్నారు. ఇక వి సముద్ర ప్రస్తుతం అనూష్క హీరోయిన్ గా పంచాక్షరి చిత్రం రూపొందిస్తున్నాడు. కొద్ది నెలల క్రిందట సముద్ర దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా వచ్చిన అధిపతి చిత్రం వచ్చింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu