»   » విచిత్రమైన స్ధితిలో రాజీ చేసిన హీరో సుమంత్

విచిత్రమైన స్ధితిలో రాజీ చేసిన హీరో సుమంత్

Posted By:
Subscribe to Filmibeat Telugu

వరస ప్లాపులతో హీరోగా కొనసాగుతున్న సుమంత్ కి ఈ సంక్రాంతికి విచిత్రమైన పరిస్ధితి ఎదురైంది. అతను హీరోగా నటించిన రెండు చిత్రాలు ఒకేసారి విడుదలకు సిద్దమయ్యాయి. అవి అష్టాచెమ్మ ఫేమ్ ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న గోల్కొండ హైస్కూల్, వి.ఎన్.ఆదిత్య దర్శకత్వంలో రూపొందిన రాజ్. ఈ రెండు చిత్రాలు షూటింగ్ లు పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమయ్యాయి. ఇద్దరు నిర్మాతలూ తమ తమ చిత్రాలను సంక్రాంతికి ధియోటర్స్ లలో దింపాలని నిర్ణయించుకున్నారు. అయితే అసలే తన కెరీర్ పరిస్ధితి బాగోలేక చూస్తున్న సుమంత్ కి ఈ సిట్యువేషన్ అర్దం కాని స్ధితిలో పడేసింది. దాంతో కొందరు పరిశ్రమ పెద్దల సలహాతో..రెండు చిత్రాల్లో ఒకదానినే ముందుకు తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఇద్దరు నిర్మాతలూ తమ చిత్రం అంటే తమ చిత్రం ముందు రిలీజ్ చేయాలంటున్నారు. మరో ప్రక్క సుమంత్..తన సినిమాను..సంక్రాంతికి ఉన్న పెద్ద సినిమాల పోటీలో దింపకూడదని నిర్ణయించుకున్నాడు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu