»   » ఈ శుక్రవారం భయపెడతానంటున్న సదా, స్నేహా ఉల్లాల్

ఈ శుక్రవారం భయపెడతానంటున్న సదా, స్నేహా ఉల్లాల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

జయం చిత్రంతో తెలుగువారికి పరిచయమైన సదా అపరిచితుడు చిత్రం అనంతరం అవకాశాలు కరువయ్యాయి. అడపాదడపా వచ్చిన ఆఫర్స్ వర్కవుట్ కాకపోవటంతో వెనకపడిపోయింది. అయితే తాజాగా ఆమె బాలీవుడ్ చిత్రం క్లిక్ అనే చిత్రంపై అంచనాలు పెట్టుకుంది. ధాయ్ హర్రర్ సినిమా షట్టర్ ని అనిఫీషయల్ గా రీమేక్ చేస్తూ వస్తున్న ఈ చిత్రంలో స్నేహా ఉల్లాల్ మరో ముఖ్య పాత్ర పోషిస్తోంది. అలాగే శ్రేయాస్ తల్పడే కూడా ఈ హర్రర్ ని రక్తి కట్టించటానికి కీలక పాత్ర చేసారు. సంగీత శివన్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంల పిబ్రవరి 19న రిలీజ్ అవుతోంది. సూపర్ న్యాచురల్ కథాంశంతో ఈ చిత్రం రూపొందిందని దర్శక,నిర్మాతలు చెప్తున్నారు. ఇక సదా ఈ విషయమై మీడియాతో మాట్లాడుతూ తాను ఈ చిత్రంలో ఓ ఫ్యాషన్ మేడల్ గా కనిపిస్తానని, శ్రేయోస్ తల్పడే ఫోటో గ్రాఫర్ గా కనపడతాడు అంటున్నారు. ఇక పూర్తిగా భయపెట్టడమే కాకుండా గ్లామర్ గా కూడా కనపడతాడు. ఓ హాట్ సాంగ్ కూడా ఉంది. అభిమానులు నిరాశపడక్కర్లేదు అని హామీ ఇస్తోంది. ఇది ఓ రొమాంటిక్ హర్రర్ అంటోంది. ఇక సూపర్ నేచురల్ పవర్ తనను వెంటాడుతుందా లేదా అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే అంటోంది. అలాగే కథలో కీలకాంశం శ్రేయాస్ తల్పడే గతమే నని చెప్తోంది.చూద్దాం స్నేహా ఉల్లాల్, సదా కలిసి ఏ మేరకు మనల్ని భయపెట్టనున్నారో...

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu