»   » అందం, అశ్లీలం అంటూ విరుచుకు పడింది: శ్రియ కోపం ఇదే

అందం, అశ్లీలం అంటూ విరుచుకు పడింది: శ్రియ కోపం ఇదే

Posted By:
Subscribe to Filmibeat Telugu

అందం, గ్లామర్, సెక్సీనెస్ ఈ మూడింటి మధ్యా చాలా తేడా ఉంటుందన్నది చాలామంది అభిప్రాయం. ఒక హీరోయిన్ బట్టల మీద ఎవరన్నా కామెంట్ చేసినప్పుదు ముందు గ్లామర్ కీ, అసభ్యతకీ తేడా తెలుసుకోండీ అంటూ చెప్తూంటారు హీరోయిన్లు. ఇంతకీ అసభ్యత అంటే ఏమిటి? ఆ మధ్య బాలీవుడ్ లో వచ్చిన సన్నీ లియోన్ సినిమాని అసభ్యంగా ఉందంటూ చాలామందే విసుర్లు విసిరారు..

కానీ ఇప్పుడు రాగినీ రిటర్న్స్ అంటూ వస్తున్న సినిమాలో రాయ్ లక్ష్మీ ఫోజ్ చూస్తే సన్నీ సినిమాకంటే బోల్డ్ గా కనిపిస్తోంది టాప్ లెస్ గా కనిపిస్తూనే కింద ఆమె వేసుకున్న షార్ట్స్‌ని కిందకి జరిపి మరీ ఇన్నర్ వేర్ ని చూపిస్తున్న పోస్టర్ విషయం లో కొంత వ్యతిరేకత ఉన్నా మరీ సన్నీ సినిమాకి వచ్చినంత మాత్రం కాదు. ఇలా ఒక్కో స్థాయిలో ఒక్కోలా అర్థం మారిపోతూంటుంది అసభ్యతకి. అయితే ఇలాంటి ప్రశ్ననే మన టాలీవుడ్ హీరోయిన్ శ్రియ ని అడిగితే ఏం చెప్పిందో చూడండీ.

Heroine Shriya serious on Netizens

అసలు అందానికి, అశ్లీలానికి తేడా ఏమిటన్న ప్రశ్నకు నటి శ్రియ ఆగ్రహంతో మండిపడింది. హీరోయిన్లు చీర కడితే వెంటనే పాత సంప్రదాయం అనేస్తారు. కాస్త మోడ్రన్‌ దుస్తులు ధరిస్తే అశ్లీలం, అసభ్యకరం అని విమర్శలు గుప్పిస్తారు. నిజం చెప్పాలంటే ఈ రెండింటిలోనూ దేనికదే అందం దాగుంటుంది.

అది చూసే వారి దృష్టిని బట్టి ఉంటుంది. అయితే సమీపకాలంలో నెటిజన్లు మోడ్రన్‌ దుస్తులు ధరించిన హీరోయిన్ల గురించి చెడుగా రాసేస్తున్నారు. గ్లామర్‌గా కనిపిస్తే చెడ్డవాళ్లా అంటూ విరుచుకుపడింది. చీర కట్టినా, మోడ్రన్‌ దుస్తులు ధరించినా అందం అనే ఒక్కటే అని తనదైన బాణీలో అందానికి శ్రియ నిర్వచనం చెప్పింది.

English summary
Heroine shriya serious on Netizens When she Asked about sexiness and Beauty
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu