twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హిట్లర్ ఎవర్?

    By Staff
    |

    జర్మనీలో ఆనాడు సాగిన హిట్లర్ పాలన నేటి రాజకీయాల్లో ఎలా కొనసాగుతోందనే కథాంశంతో హిట్లర్ (ది ఇండియన్ కనెక్షన్) అనే చిత్రం రూపొందుతోంది. శ్రీనివాసరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రేవంత్ పి. దర్శకత్వం వహిస్తున్నారు. సూర్య ఈ చిత్రంలో హిట్లర్ పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్ర విశేషాల గురించి దర్శకుడు రేవంత్ వివరించారు. 1930-40 మధ్య కాలంలో జర్మనీలో జరిగిన హింసాకాండ ప్రస్తుతం మన దేశంలో కొనసాగుతున్న తీరును ఈ చిత్రంలో చూపిస్తున్నామని అన్నారు. అప్పట్లో జాతులు, బానిసలు, జీన్స్ వంటి పలు కారణాలతో ఒకరికొకరు కొట్టుకునేవారు. నేడు కళ పేరుతో కులాల వారీగా రెచ్చగొడుతున్న విధానం, సోషలిజం ముసుగులో సమాజానికి జరుగుతున్న అన్యాయాన్ని గురించి ఈ చిత్రంలో చర్చించామని చెప్పారు. ఇప్పటికి డెబ్బైశాతం షూటింగ్ పూర్తయ్యిందని, కొద్దిరోజుల్లో మొత్తం షూటింగ్ పూర్తవుతుందని ఆయన అన్నారు. చిత్ర నిర్మాత శ్రీనివాసరెడ్డి మాట్లడుతూ రాజకీయాలంటే ప్రజలు విసిగిపోయి, భావోద్వేగంతో ఎలాంటి వ్యక్తి తమ నాయకునిగా రావాలనుకుంటున్నారు అనే విషయాన్ని ఈ చిత్రంలో చర్చించామని అన్నారు. ఈ చిత్రం ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసేలా ఉంటుందని ఆయన అన్నారు. ఈ చిత్రంలో నరేంద్ర, సురేష్, నాగభైరవ అరుణ్‌కుమార్ తదితరులు నటిస్తున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X