»   » వరుణ్ తేజ్ మూవీ ఇంత భారీగానా.. హాలీవుడ్ నుంచి దిగుతున్నారు!

వరుణ్ తేజ్ మూవీ ఇంత భారీగానా.. హాలీవుడ్ నుంచి దిగుతున్నారు!

Subscribe to Filmibeat Telugu

వరుణ్ తేజ్ చివరగా నటించిన చిత్రం తొలిప్రేమ. ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. వరుణ్ తేజ్ కు బ్యాక్ టూ బ్యాక్ రొమాంటిక్ హిట్లు దక్కాయి. శేఖర్ కమ్ముల తెరెకక్కించిన ఫిదా చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ తరువాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటించిన తొలి ప్రేమ చిత్రం కూడా సూపర్ హిట్ కావడంతో వరుణ్ తేజ్ మంచి జోష్ మీద ఉన్నాడు.

వరుణ్ తేజ్ తదుపరి ఘాజి ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం అంతరిక్ష పరిశోధన నేపథ్యంలో రూపొందబోతోంది. ఘాజి చిత్రంలో సబ్ మెరైన్ యుద్దాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన సంకల్ప్ రెడ్డి.. వరుణ్ తో తీయ బోయే చిత్రంలో ఎలాంటి ప్రయోగం చేయబోతున్నాడో అని అభిమానుల్లో ఆసక్తి నెలకొని ఉంది. ఈ చిత్రం భారీ స్థాయిలో తెరెక్కించడానికి సన్నకాహాలు చేస్తున్నారు. అంతరిక్ష నేపథ్యంలోని చిత్రం టాలీవుడ్ కు కొత్త. కాబట్టి సంకల్ప్ రెడ్డి హాలీవుడ్ నిపుణుల సూచనలు తీసుకోవాలని భావిస్తున్నారు.

Hollywood team to train Varun Tej’s team

దీనికోసం హాలీవుడ్ నుంచి ఓ టీం హైదరాబాద్ రానుంది. ఈ టీం చిత్ర యూనిట్ మొత్తానికి రెండు వారాల పాటు ట్రైనింగ్ ఇవ్వబోతోంది. హాలీవుడ్ నిపుణుల సూచనలు అనంతరం రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించబోతున్నారు. ప్రముఖంగా ఈ చిత్రాల్లో యాక్షన్ సన్నివేశాలు ఎలా చిత్రీకరించాలి అనే విషయంలో హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ లు సూచనలు ఇవ్వనున్నారు.

English summary
Hollywood team to train Varun Tej’s team. Sankalp Reddy is the movie director.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X