»   » బ్రహ్మోత్సవం బాగానే ముంచేసింది: బయ్యర్లని ఎలా ఆదుకుంటారు...!?

బ్రహ్మోత్సవం బాగానే ముంచేసింది: బయ్యర్లని ఎలా ఆదుకుంటారు...!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

బ్రహ్మోత్సవం ఇంకో టాలీవుడ్ డిజాస్టర్ అన్న విశయం పక్కా అయ్యింది. ఇక ప్రేక్షకులు కూడా ఇతర సినిమాల వైపు దృష్టి మరల్చారు. ఎంత కవర్ చేసి లాక్కొద్దామన్న వీలుకానంత ధారుణంగా చతికిల బడటం తో ఇప్పుడు అందరి దృష్టి బ్రహ్మోత్సవం ఇన్ని నష్టాలను మిగ్చింది అన్న విశయం మీదనే.

"బ్రహ్మోత్సవం" శ్రీ మంతుడు లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వచ్చిన సినిమా కాబట్టి భారీ అంచనాల వల్ల 73 కోట్ల భారీ బిజినెస్ జరిగింది. తొలిరోజు వచ్చిన టాక్ తో బయ్యర్ల నెత్తిమీద పిడుగు పడింది. ఈ సంవత్సరం బయ్యర్లని నిండాముంచిన మరో టాప్ హీరో పవన్ సరన చేరాడు మహేష్ బాబు కూడా..


బ్రహ్మోత్సవం విడుదలైన మొదటి రోజు 12 కోట్లు వసూలు చేసింది. అయితే రెండోరోజు నుంచే వసూళ్లు దారుణంగా పడిపోయాయి.చాలా సెంటర్లలో ఈ సినిమా తీసేసి సుప్రీమ్ తో నింపేసారు. ఇక మరింత ధారుణ అవమానం ఏమిటీ అంటే మన సూపర్ స్టార్ సినిమా స్థానంలో తమిళ్ డబ్బింగ్ సినిమా బిచ్చగాడు వేసుకున్నారు.బ్రహ్మోత్సవం ఇవ్వని ఫలితాన్ని ఒక డబ్బింగ్ సినిమాతో సమం చేసుకున్నారు.


How much they lost from Brahmotsavam

ఈ మధ్య కాలంలో మహేశ్ కెరీర్ లో ఇంత దారుణమైన సినిమాను చూడలేదంటూ అభిమానులే నిట్టూరుస్తున్నారు. సినిమా కథని పక్కన పెట్టి బిజినెస్ విశయానికి వస్తే ఇప్పటి వరకు ఈ సినిమా వసూలు చేసింది 35 కోట్లు మాత్రమే. అది కూడా ఓవర్సీస్ లో 7 కోట్లు రావడంతో 35 కోట్ల మార్క్ అయినా అందుకుంది. లేదంటే పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది.


ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బ్రహ్మోత్సవం ఇప్పటి వరకు రాబట్టింది 22 కోట్లు మాత్రమే. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కావాల్సింది 54 కోట్లు. అంటే అక్షరాలా 30 కోట్లకు పైగానే దెబ్బపడింది. ఈ నష్టం మామూలుదేం కాదు. బయ్యర్లలో కొందరు కోలుకోవటానికి కూడా చాలా సమయం పట్టేలా ఉంది.


ఇక లోకల్ గా పక్కన పెట్టి చూసినా ఓవర్సీస్ లో ఈ సినిమాని 13 కోట్లకు అమ్మారు. అక్కడ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వరల్డ్ వైడ్ గా లైఫ్ టైమ్ బిజినెస్ చూసుకుంటే బ్రహ్మోత్సవం 35 కోట్లే వచ్చాయి. అంటే దాదాపు అటూ ఇటూగా ఒకటీరెండు కాదు 40 కోట్ల మేరకు నష్టాలు వచ్చాయి.... మరి ఈ నష్టాలను ఎలా పూడుస్తారో బయ్యర్లని ఏ మేరకు ఆదుకుంటారో చూడాలి మరి... నష్టాలను పూడుస్తాం అన్న మహేష్ బాబు మాటల మీదే ఆశలు పెట్టుకున్నారట బయ్యర్లు .

English summary
Brahmotsavam Makers to Compensate Losses to Buyers.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu