»   » వర్మ 'రక్త చరిత్ర' చిత్రంపై సెన్సార్ కు నోటీసులు

వర్మ 'రక్త చరిత్ర' చిత్రంపై సెన్సార్ కు నోటీసులు

Posted By:
Subscribe to Filmibeat Telugu

"రక్త చరిత్ర" ను నిషేధించాలంటూ ఓసీ సంక్షేమ సంఘం సోమవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కేసు విచారణకు స్వీకరించిన కమిషన్‌ తాత్కాలిక ఛైర్మన్‌ కాకుమాను పెద్దపేరిరెడ్డి నవంబరు 11లోగా దీనిపై నివేదిక ఇవ్వాలని సెన్సార్‌ బోర్డుకు నోటీసులు జారీ చేశారు. రక్త చరిత్ర చిత్రం హింసను ప్రేరేపించే విధంగా, ఓ సామాజికవర్గం మనోభావాలు దెబ్బతీసేలాఉందని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.కరుణాకర్‌రెడ్డి ఆరోపించారు.

మరో ప్రక్క రెడ్లను దుర్మార్గులుగా, విలన్లుగా సినిమాలో చూపించారని, కమ్మలను ఉత్తములుగా చూపించారని రెడ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుక్కారెడ్డి పాత్రను దుష్టుడిగా చూపించడంపై వారు మండిపడుతున్నారు. దీనిపై ఒసి సంక్షేమ సంఘం రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసింది. రెడ్లలో చాలా మంది ఫాక్షనిస్టులనే అభిప్రాయం సినిమా వల్ల కలుగుతుందని సంఘం అధ్యక్షుడు కరుణాకర రెడ్డి అన్నారు. కమ్మలు, రెడ్లు కలిసిపోతున్న సమయంలో మళ్లీ పాత కక్షలను సినిమా రెచ్చగొట్టే విధంగా ఉందని ఆయన ఆరోపిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu