»   » బాహుబలి గ్రేట్ ఫిల్మ్... నాకు జాతీయ అవార్డు వస్తుందేమో!

బాహుబలి గ్రేట్ ఫిల్మ్... నాకు జాతీయ అవార్డు వస్తుందేమో!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘బాహుబలి' సినిమాపై జనాల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. మరో వైపు ఈ చిత్ర ఛాయాగ్రాహకుడు సెంథిల్ కుమార్ కూడా ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నారు. ఈ సినిమాలో తన నైపుణ్యానికి జాతీయ అవార్డు వస్తుందనే ఆశతో ఆయన ఎదురు చూస్తున్నారు.

‘బాహుబలి' చిత్రాన్ని గొప్ప చిత్రంగా పేర్కొన్న సెంథిల్ కుమార్ భారతీయులంతా గర్వించే విధంగా సినిమా ఉంటుందన్నారు. ఇప్పటి వరకు అంతా మాయా మజార్ గురించి మాట్లాడుకున్నారు. ఇకపై బాహుబలి గురించి మాట్లాడుకుంటారు అని సెంథిల్ కుమార్ స్పష్టం చేసారు.

Senthil Kumar

నేనెప్పుడూ అవార్డుల గురించికలలు కంటాను. బాహుబలి చిత్రానికి ఆస్కార్ అవార్డు రావాలని కోరుకుంటాను. అందుకు ఏ మాత్రం తగ్గకుండా తీసిన సినిమా ఇది. జాతీయ అవార్డు అందుకోవాలనే నా కల ఇంకా నెరవేరలేదు. ఈ చిత్రానికి గాను నాకు జాతీయ అవార్డు వస్తుందని ఆశిస్తున్నాను అన్నారు.

రాజమౌళితో పని చేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఆయన పనితీరు ప్రత్యేకంగా ఉంటుంది. ఆయనతో పని చేయడం వల్ల ఆయనతో పాటు ఆయనతో పని చేసే వారికి కూడా మంచి పేరొస్తుంది అన్నారు. భవిష్యత్తులో దర్శకత్వం చేసే ఆలోచన ఉంది. బాహుబలి 2 సినిమా తర్వాత దాని గురించి ఆలోచిస్తాను అన్నారు.

English summary
"I always dream about Awards. I wish 'Baahbuali' bags Oscar award as it's a film on par with such high standards. I always wanted to receive a National award but it never fulfilled. I'm confident of receive that honour this time with 'Baahubali'". Senthil Kumar said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu