»   » దాని మీద నిత్యానందకు పేటెంట్ లేదు: హైకోర్టులో రాజేంద్రప్రసాద్

దాని మీద నిత్యానందకు పేటెంట్ లేదు: హైకోర్టులో రాజేంద్రప్రసాద్

Posted By:
Subscribe to Filmibeat Telugu

అలాంటి కాషాయం బట్టలు వేసుకున్నవారంతా స్వామి నిత్యానందలుకారు.స్వామి వివేకానంద లాంటి గొప్ప గొప్ప వారంతా అలాంటి బట్టలునే ధరించారు.ఆ బట్టలు మీద నిత్యానందకు ఏమీ పేటెంట్ హక్కు లేదు.అంటూ ఎపి హైకోర్టులో రాజేంద్రప్రసాద్ అఫిడవిట్ ధాకలు పరిచారు. రాజేంద్రప్రసాద్ నటించిన అయ్యారే సినిమా ప్రదర్శనను నిలిపేయాలని కోరుతూ సెక్స్ స్వామి నిత్యానంద కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దాంతో రాజేంద్రప్రసాద్ ఇలా స్పందించారు.అలాగే తాను నిత్యానంద పాత్రను పోషించలేదని అన్నారు.అలాగే ఈ స్వామి గురించి ప్రతీ ఛానెల్ వారు వీడియో టేప్ లు చూపెడుతున్నారు. వారందరినీ ఆయన ఆపుచేయగలరా.ఆ ఛానెల్స్ పై చర్య తీసుకోగలరా అని ప్రశ్నించారు.

ఇక సినీ నటి రంజితతో రాసలీలలు జరుపుతూ స్వామి నిత్యానంద వీడియోకు చిక్కిన ఇతివృత్తం ఆధారంగా అయ్యారే సినిమాను నిర్మించారు. ప్రముఖ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమాలో స్వామి నిత్యానంద పాత్రను పోషించారు. ఈ సినిమా తన ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా ఉందని అంటూ ఆ సినిమా విడుదలను అనుమతించవద్దని స్వామి నిత్యానంద కోర్టును కోరారు. అయ్యారే సినిమా షూటింగ్ సెప్టెంబర్ 3వ తేదీన ప్రారంభమైంది. సినిమా నిర్మాణం పూర్తయి విడుదలకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ సినిమాకు సాగర చంద్ర దర్శకత్వం వహించారు. బి. సుధాకర్, రంగన, అచ్చప్ప నిర్మాతలు. ఈ సినిమాలో పోలీసాఫీసరు పాత్రను సాయికుమార్ పోషించారు.

English summary
Whoever wears saffron is not Nityananda and great seers like Swamy Vivekananda also wore saffron and Nityananda has got no patent over saffron robes", Rajendra prasad said in the affidavit he filed in the AP High Court.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu