»   » పవన్ కళ్యాణ్ 'పులి' తో నాకు సంబంధం లేదు...1?

పవన్ కళ్యాణ్ 'పులి' తో నాకు సంబంధం లేదు...1?

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవన్ కళ్యాణ్ తాజా సినిమా 'కొమరం పులి" తెలుగు సినిమా గత రికార్డుల్ని తిరగరాస్తుందని చెబుతున్నారు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్. తానూ పవన్ కళ్యాణ్ కి వీరాభిమానినన్న అల్లు అరవింద్, పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకల్లో అభిమానులతో కలిసి పాలుపంచుకున్నారు. ఇక, 'కొమరం పులి" సినిమాతో తనకు సంబంధం లేదనీ, ఆ సిపనిమాని తాను విడుదల చేయడం లేదనీ, 'కొమరం పులి" సినిమా నిర్మాతే ఆ సినిమాని విడుదల చేస్తారని అల్లు అరవింద్ స్పష్టం చేశారు.

పవన్ కళ్యాణ్ పవర్ ఏంటో 'పులి" సినిమాతో మరోమారు ప్రూవ్ అవుతుందని, తమ బ్యానర్ లో వచ్చిన 'జల్సా" సినిమా తమ బ్యానర్ వ్యాల్యూని పెంచిందని అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు. 'కొమరం పులి" సినిమాని అల్లు అరవింద్ గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారంటూ ప్రచారం జరుగుతుండగా, 'పులి" తో తనకు సంబంధం లేదని అల్లు అరవింద్ ప్రకటించడం గమనార్హం. సినిమా మీద వున్న నమ్మకంతోనే నిర్మాత శింగనమల రమేష్, 'కొమరం పులి" సినిమాని ఎవరికీ అమ్మకుండా తానే సొంతంగా రిలీజ్ చేసుకుంటున్నారని అల్లు అరవింద్ ప్రకటనతో స్పష్టవుతోంది

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu