»   » వినోద్ రాయల్ హత్య, తన క్రిస్టియన్ కూతురు, సర్దార్ నష్టాలపై: తిరుపతి సభలో పవన్

వినోద్ రాయల్ హత్య, తన క్రిస్టియన్ కూతురు, సర్దార్ నష్టాలపై: తిరుపతి సభలో పవన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

తిరుపతి: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరుపతి బహిరంగ సభలో మరోసారి ఆవేశంగా తన గళం విప్పారు. జనసేన పార్టీ యాక్టివ్ గా లేదని అభిమానులు కలత చెందవద్దని, తాను పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వస్తున్నానంటూ శుభవార్త చెప్పారు.

సినిమాలు తనకు పూర్తి స్థాయి ఆనందాన్ని ఇవ్వలేదని, ఇకపై తన పాతికేళ్ల జీవితాన్ని జనం కోసంమే అకింతం చేయబోతున్నట్లు స్పష్టం చేసారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులకు కొన్ని సూచనలు చేసారు.

సినిమాలను సినిమాలుగా చూడాలని, వాటిని నిజ జీవితానికి ఆపాదించుకోవద్దని, సినిమా వేరు... జీవితం వేరు అని స్పష్టం చేసారు. ఒకరికొకరు చంపుకునేంత అభిమానం వద్దని పవన్ కళ్యాణ్ సూచించారు. సినిమా నటులమంతా బాగానే ఉంటామని, వాళ్లు నాతో బాగానే మాట్లాడతారు అని పవన్ కళ్యాణ్ తెలిపారు.

సినీ రంగంలో తనకు ఏ కథానాయకుడితోనూ విభేదాలు లేవని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. తాను సినీ జీవితం కన్నా, నిజ జీవితాన్ని సీరియస్‌గా తీసుకుంటానని తెలిపారు. సినిమాను కేవలం వినోదంగానే చూడాలని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. జనసేనాని వినోద్‌ రాయల్‌ హత్య తనకు చాలా బాధ కలిగించిందన్నారు. క్షణికావేశం ఓ తల్లికి గర్భశోకం మిగిల్చిందన్నారు. బిడ్డ హత్యకు గురైనా ఆ తల్లి తన బిడ్డ కళ్లను దానం చేసిందని పేర్కొన్నారు. వినోద్‌రాయ్‌ తల్లికి తాను పాదాభివందనం చేస్తున్నానన్నారు.

సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు డబ్బులు రాలేదనే అంశంతో పాటు తన క్రిస్టియన్ కూతురు గురించి తిరుపతి సభలో పవన్ కళ్యాణ్ చెప్పిన మరిన్ని విషయాలు స్లైడ్ షోలో....

కుల మత బేధం వద్దు

కుల మత బేధం వద్దు


తనకు కుల మత బేధాలు లేవని...మనదంతా ఒకే కులం, ఒకే మతం...మానవ కులం అని పవన్ కళ్యాణ్ తెలిపారు.

నా కూతురు క్రిష్టియన్

నా కూతురు క్రిష్టియన్


తనకు కులం అంటగట్టవద్దని, తన కుమార్తె క్రిస్టియన్ అని చెప్పారు. రష్యన్ అయిన తన భార్య తన కుమార్తెను క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారమే పెంచుతానంటే ఓకే చెప్పానన్నారు.

తన భార్య గురించి..

తన భార్య గురించి..


తన భార్య జీసస్‌ను పూజిస్తామన్నా తనకు అభ్యంతరం లేదని ఎన్నిరూపాల్లో ఉన్నా తనకు దేవుడు ఒక్కడేనని చెప్పారు.

దేవుడుని నమ్మండి కానీ....

దేవుడుని నమ్మండి కానీ....


దేవుడుని నమ్మకండి కానీ కులాల పేరుతో మతాల పేరుతో కొట్టుకోవడం మానేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు.

కోట్లు సంపాదిస్తున్నా

కోట్లు సంపాదిస్తున్నా


సినిమాల్లో కోట్లు సంపాదిస్తున్నా.... కోట్ల రూపాయల టాక్స్ కడుతున్నా... అయినా నాకు సినిమాల్లో ఆనందం లేదని తెలిపారు.

నా జీవితం ప్రజలకోసమే

నా జీవితం ప్రజలకోసమే


ఇక నా జీవితం ప్రజల కోసమే.... వారి సమస్యలపై ప్రశ్నించం, పోరాడటం కోసమే జనసేన పార్టీ అని పవన్ కళ్యాణ్ తెలిపారు.

సినిమాలు చేస్తాను

సినిమాలు చేస్తాను


సినిమాలు చేస్తూనే రాజకీయాలు చేస్తాను అని పవన్ కళ్యాణ్ తెలిపారు.

మీరు సినిమాలు చూస్తేనే నాకు డబ్బులు

మీరు సినిమాలు చూస్తేనే నాకు డబ్బులు


మీరు సినిమాలు చూస్తేనే నాకు డబ్బుల వస్తాయంటూ పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా చమత్కరించారు.

సర్దార్ వల్ల నష్టాలే...

సర్దార్ వల్ల నష్టాలే...


సర్దార్ సినిమాను మీరు సరిగా చూడక పోవడం వల్లనే డబ్బులు రాలేదు....ఈ సారి గట్టిగా చూడండి అంటూ మరోసారి చమత్కరించారు పవన్ కళ్యాణ్.

.ప్రజల సపోర్టు ఉంటే రెండు చేస్తా

.ప్రజల సపోర్టు ఉంటే రెండు చేస్తా


తాను నటనా చేస్తాను...రాజకీయాలు చేస్తానని అన్నారు. ప్రజలు తన వెనుక నిలిస్తే ప్రత్యేక హోదా విషయంలో మడమ తిప్పని పోరాటం చేస్తామని అన్నారు.

English summary
‘I will continue in movies’ Power star Pawan Kalyan said at Tirupathi meeting on saturday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu