»   » 'అష్టా చెమ్మ' డైరక్టర్ నెక్ట్స్ ఏ హీరోతో నంటే...

'అష్టా చెమ్మ' డైరక్టర్ నెక్ట్స్ ఏ హీరోతో నంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

అష్టాచెమ్మ, గోల్కొండ హైస్కూల్ చిత్రాలతో తానేంటో ప్రూవ్ చేసుకున్న దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ. ఆయన తన తదుపరి చిత్రాన్ని సుశాంత్ హీరోగా ప్రారంభించనున్నాడు. శ్రీ నాగ్ కార్పోరేషన్ పతాకంపై ఈ చిత్రాన్ని చింతలపూడి శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. గతంలో ఈ బ్యానర్ పై కాళిదాసు, కరెంటు చిత్రాలు నిర్మించారు. రెండూ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకున్నాయి. ఇక ఈ విషయం మీడియాకు చింతలపూడి శ్రీనివాసరావు తెలియచేస్తూ..మోహన్ కృష్ణ చెప్పిన స్టోరీలైన్ చాలా ఇంప్రెసెవ్ గా ఉంది. సుశాంత్ కి ఈ చిత్రం మంచి బ్రేక్ ఇచ్చి కొత్త ఇమేజ్ తీసుకొస్తుందని భావిస్తున్నాం అన్నారు. ఇక మోహన్ కృష్ణ రూపొందించిన గోల్కొండ హైస్కూల్ చిత్రం సంక్రాంతికి విడుదలై మంచి టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ సంపాదించలేకపోయింది.

English summary
Ashta Chemma fame Indraganti Mohan Krishna will be directing Sushanth this time. Sri Naag Corporation that produced Sushath's earlier two films - Kalidas and Current, will be producing this movie. Producer Chintalapudi Srinivas Rao said that the story line is very impressive. "This movie would definitely give good break to Sushanth and I am sure that he will get new image with this," he added.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu