twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘సినిమా’ ఇంకా అందని ద్రాక్షే

    By Bojja Kumar
    |

    రఫీ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన 'ఇంకెన్నాళ్లు" చిత్ర ప్రచార పోస్టర్లను తెలంగాణ భవన్ లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కవిత మాట్లాడుతూ...'సినిమా అనేది అప్పటికీ ఇప్పటికీ తెలంగాణ బిడ్డలకు అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది. తెలంగాణ బిడ్డలు తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో రూపొందిస్తున్న చిత్రాలను ఆదరించడంలేదన్న వాదనలో వాస్తవం లేదు. ఎందుకంటే సినిమానే జీవితం, జీవితమే సినిమా అనుకునే సంస్కృతి తెలంగాణలో లేదు. ముందు మా దృష్టి మొత్తం ఉద్యమంపైనే. ఆ తర్వాతే సినిమా" అన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. ఇప్పుడిప్పుడే తెలంగాణ కళాకారులు సినిమాల్లోకి వస్తున్నారు. వారిని ఆదరించాల్సిన బాధ్యత తెలంగాణ సమాజంపై వుంది. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఈ తరుణంలో రఫీ రూపొందించిన 'ఇంకెన్నాళ్లు" చిత్రం మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను" అన్నారు.

    ఈ సినిమా గురించి రఫీ మాట్లాడుతూ... తెలంగాణ బాషని, యాసను వ్రకీకరించి విలనిజానికి వాడుతున్నారు. మన బాష, మన బతుకు కొన్ని చిత్రాల్లోనే చూపించారు. ఇంకెన్నాళ్లు చిత్రంలో మన సంస్కృతి, మన పోరాటం, తెలంగాణ ఉద్యమం కోసం సకలజనులు చేసిన సమ్మెనూ ఇందులో చూపించాను. తెలంగాణ ఎలా వస్తుందో, ఏం చేస్తే వస్తుందో ఇందులో రెండు సూత్రాలు చెప్పడం జరిగింది అన్నారు.

    English summary
    'Inkennallu' movie Poster Released at Telangana Bhavan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X