»   » 17 ఏళ్లకే బ్రేకప్, రాజ్ తరుణ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు!

17 ఏళ్లకే బ్రేకప్, రాజ్ తరుణ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మావ, కుమారి 21 ఎఫ్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో రాజ్ ఇటీవల ఓ టీవీ షోలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు అభిమానులకు తెలియని ఎన్నో విషయాలు పంచుకున్నారు.

ఇండస్ట్రీలో రాజ్ తరుణ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే... ముందుగా నిఖిల్ పేరే చెప్పాడు. షూటింగులు లేనపుడు ఖాళీగా ఉంటే ఇంట్లో కూర్చుని సినిమాలు చూడటం, నిఖిల్ తో కలిసి పార్టీలకు వెళ్లడం లాంటివి చేస్తుంటానని రాజ్ తరుణ్ తెలిపారు.

నిఖిల్‌తో చాలా క్లోజ్

నిఖిల్‌తో చాలా క్లోజ్

నిఖిల్ అంటే రాజ్ తరుణ్ కి చాలా ఇష్టం. నిఖిల్ మూవీ రిలీజ్ అవుతున్న రోజు రిజల్ట్ పై తనకంటే ఎక్కువటెన్షన్ పడతాడట. నిఖిల్ నటించిన ఎక్కడికి పోతావు చిన్నవాడా మూవీకి హిట్ టాక్ రావడంతో వెంటనే ప్రెండ్స్‌ను పిలిచి పార్టీ ఇచ్చాడట. ఈ ఇద్దరి మధ్య ఇంత ఫ్రెండ్షిప్ ఉందని ఎవరూ ఊహించి ఉండరు.

బ్రేకప్

బ్రేకప్

రాజ్ తరుణ్ ఈ టీవీ షోలో ఓ ఆసక్తికర విషయం చెప్పుకొచ్చాడు. టీనేజ్ వయసు లోనే ప్రేమలో పడ్డానని, 17 యేళ్లకే బ్రేకప్ అయిందని వెల్లడించారు.

మహేష్ బాబు అంటే ఇష్టం

మహేష్ బాబు అంటే ఇష్టం

తెలుగు హీరోల్లో తనకు మహేష్ బాబు అంటే చాలా ఇష్టమని రాజ్ తరుణ్ వెల్లడించారు.

సమంత కు అభిమాని

సమంత కు అభిమాని

హీరోయిన్లలో సమంత అంటే చాలా ఇష్టమని.... ఓ ప్రశ్నకు రాజ్ తరుణ్ సమాధానం ఇచ్చారు.

వర్మ ఆఫీసులో వాలిపోతా

వర్మ ఆఫీసులో వాలిపోతా

ఒక రోజు సడన్ గా మాయం అయ్యే అవకాశం వస్తే ఏం చేస్తావనే ప్రశ్నకు......అర్జెంటుగా రామ్ గోపాల్ వర్మ ఆఫీస్ కి వెళ్లి, అక్కడ ఎవరూ లేనప్పుడు ఆయన ఏం చేస్తున్నాడో చేస్తున్నాడో చూస్తానని రాజ్ తరుణ్ చెప్పుకొచ్చారు.

బెస్ట్ డాన్సర్

బెస్ట్ డాన్సర్

టాలీవుడ్ లో బెస్ట్ డ్యాన్సర్ ఎవరూ అనే ప్రశ్నకు కూడా ఏమాత్రం ఆలోచన లేకుండా అల్లు అర్జున్ పేరు చెప్పాడు రాజ్ తరుణ్.

నెగెటివ్ రోల్స్

నెగెటివ్ రోల్స్

నటనా రంగంలో పెద్ద డ్రీమ్ రోల్స్ ఏమీ లేవని, నెగిటివ్ క్యారెక్టర్ కూడా చేయాలని ఉందని రాజ్ తరుణ్ చెప్పారు.

సినిమాలు

సినిమాలు

ప్రస్తుతం రాజ్ తరుణ్ రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో ఒకటి సంజన రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతెున్న ‘రాజుగాడు యమ డేంజర్'. దీంతో పాటు పులికేక అనే మరో చిత్రంలో కూడా చేస్తున్నాడు.

English summary
Actor Raj Tarun recently said interesting things in a TV interview. At the age of 17, his love has failed.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu