»   » షకీలా పెళ్లి వార్త...దుమారం

షకీలా పెళ్లి వార్త...దుమారం

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : ఒకప్పటి సెక్స్ బాంబ్, నటి షకీలా బుధవారం పెళ్లి చేసుకున్నారంటూ అంతటా దుమారం రేగింది. ఇంటర్‌నెట్, ఫేస్‌బుక్‌, ట్విట్టర్ లో ఫొటోలు హల్‌చల్ చేశాయి.భాషా భేధం లేకుండా అన్ని రాష్ట్రాల వారినీ తన సెక్సీ నటనతో ఉర్రూతలూగించిన షకీలా పెళ్ళి చేసుకుందని వార్తలు వచ్చాయి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ కొనసాగిస్తున్న షకీలా 28 ఏళ్ల యువకుడిని పెళ్లి చేసుకున్నట్లు ఫొటోలతో సహా సోషల్ నెట్ వర్కులో ప్రచారం అవడం ఆసక్తి కరంగా మారింది. దీనికి స్పందించిన షకీలా ఆ ప్రచారంలో నిజం లేదన్నారు. నెట్‌లో ప్రచారం అవుతున్న ఫొటోల్లో తనతో ఉన్న యువకుడు, తాను దర్శకత్వం వహిస్తున్న సినిమాలో నటిస్తున్న హీరో అని వివరించారు.

అతని వయసు (28) అని, తన వయసు (38)అని, అతను తన తమ్ముడి లాంటివాడని పేర్కొన్నారు. అయినా తనకిప్పుడు పెళ్లి అవసరం ఏముందని ప్రశ్నించారు. పిల్లల కోసం అయినా పెళ్లి చేసుకోవచ్చుగా అని అంటున్నారని తానిప్పుడు పిల్లల్ని కని భూమికి భారం చేయాలా అని అన్నారు. అలాంటి పెళ్లి, పిల్లలు ఆశ తనకు లేదని స్పష్టం చేశారు. ప్రతి నెలా కొందరు అనాథ బాలలకు కొంత మొత్తాన్ని సాయం చేస్తున్నట్లు షకీలా వెల్లడించారు.

Internet hoax on Shakeela's marriage!!

ఒకప్పుడు తన అందాల ఆరబోత నటనతో మలయాళ చిత్ర పరిశ్రమను ఊపేశారు షకీలా. ఆమె నటించిన పలు చిత్రాలు తెలుగు, తమిళ భాషలలో అనువాదమై వసూళ్ల వర్షం కురిపించాయి.

గతంలో ఒకసారి..

గతంలో అంటే 2010 జూన్ లో.. షకీలా కొంత కాలంగా తమిళనాడుకి చెందిన ఓ బిజెనెస్ మ్యాన్ తో ప్రేమలో ఉన్నానని అతన్నే పెళ్లిచేసుకుంటానని ఆమే కన్ఫర్మ్ చేసింది. ఈ విషయమై మాట్లాడుతూ..నేను కొంతకాలంగా ఓ బిజినెస్ మ్యాన్ తో ప్రేమలో ఉన్నానన్నది నిజం. మేము జూన్ లో పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాం. అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక ఇది ఇరు వైపులా పెద్దల అంగీకారంతో జరుగుతున్న వివాహం. ఇక అతని పేరు మిగతా వివరాలు చెప్పాలంటే ఆయన అనుమతి కావాల్సిందే అంటూ సిగ్గుపడిందామె.

అంతేకాక అప్పట్లో ఆమె తన కాబోయే భర్త గురించి చెబుతూ..ఆయన కేరళ నా వీరాభిమాని..నా సినిమాలన్నీ చూసిన వ్యక్తే. అలాగే పూర్తి స్దాయిలో పారిశ్రామికవేత్తగా సెటిలయిన వ్యక్తి. అంతేగాక నా సినీ జీవితం వెలుగు-నీడలు తెలిసిన మనిషి. అందుకే నన్ను ఆయన వర్జిన్ గా ట్రీట్ చేయాలని కోరుకోవటం లేదు. ఓ మంచి మనిషిగా..మనస్సు కలిసిన వ్యక్తిగా వివాహం చేసుకోదలిచాను. అనుమానం ఉంటేనే అపార్ధం..అన్ని విషయాలు క్లారిటీగా ఉంటే వైవాహిక జీవితం ప్రశాంతంగా నడుస్తుందనే నమ్మకం ఉంది. అయినా నా వివాహాన్ని పెద్ద ఇష్యూగా చెయ్యదలుచుకోలేదు అంటూ తన మనస్సులో మాటలను విప్పింది షకీలా. అయితే ఆ వివాహం సంగతి ఏమైందో తెలియరాలేదు.

English summary
Shakeela's who is very well-known for her softcore and B-grade movies became a victim of online marriage hoax.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu