»   » మళ్ళీ అదే పనా....!? ఈ సారి దెయ్యాల స్పూఫ్ ల తో కథ ..!? ఈసారి దెబ్బ పడితే కష్టమే

మళ్ళీ అదే పనా....!? ఈ సారి దెయ్యాల స్పూఫ్ ల తో కథ ..!? ఈసారి దెబ్బ పడితే కష్టమే

Posted By:
Subscribe to Filmibeat Telugu

కామెడీ కంటూ ప్రత్యేకంగా హీరోలు అనగానే ఒకప్పుడు రజేంద్ర ప్రసాద్, నరేష్, చంద్ర మోహన్ ఇలా కొందరు హీరోలుండే వాళ్ళు వాళ్ళ తర్వాత మాస్ హీరోలే తప్ప కామెడీ చేసే హీరోలకి కొరత ఏర్పడింది. అడపాదడపా అలి, బాబూ మోహన్ వంటి కమేడియన్లనే హీరోలుగా చేసి సినిమాలు వచ్చినా వాళ్ళు ఫుల్ టైం కమేడియన్లుగానే తప్ప కామెడీ హీరోలుగా నిలబడలేక పోయారు. ఇక కొంత కాలానికి వారూ హీరో వేశాల వయసునుంచి తప్పుకునే సమయం లో మళ్ళీ ఒక ఫుల్ టైం కామెడీ హీరోగా వచ్చాడు అల్లరి నరేష్....

అదే సమయం లో కామెడీ ప్రధానం గా కొత్త హీరోలు చాలామందే వచ్చినా సినిమాలు తప్ప హీరోలు నిలబడలేదు. ఆ సమయం లో వచ్చిన అవకాశాలను అందుకుంటూ... చిన్న నిర్మాతలకూ ఒక మినిమం గ్యారెంటీ హీరోగా మారాడు ఈ అల్లరోడు. అయితే పోనూ పోనూ ఎన్నని కామెడీ కథలు రాయగలరూ... అప్పటికే మొనాటనీ వచ్చేస్తూందటం తో... సక్సెస్ అయిన మాస్ సినిమాలలో కొన్ని సీన్లని స్పూఫ్ చేయటం మొదలు పెట్టాడు... ఈ ఫార్ములా మాంచి ఊపు తీసుకు రావటం తో ఫుల్ లెంగ్త్ స్పూఫ్ మూవీ గా "సుడిగాడు" తీసుకు వచ్చాడు... బంపర్ హిట్ అనిపించుకున్న ఈ సినిమా తర్వాత కూడా అదే ఫార్ములా కంటిన్యూ చేస్తూ... "సెల్ఫీరాజా" అంటూ వచ్చాడు గానీ జనం పెద్దగా ఆదరించలేదు. స్పూఫ్ లతో జనం విసుగెత్తి పోయారని అర్థమైపోయింది...

Is Allari Naresh's Intlo "Deyyam Nakem Bayyam" again with Horror movie spoofs ?

అలాంటి సమయం లో మరి తర్వాతి సినిమాలో అల్లరోడు ఏం చూపిస్తాడన్నది ఆసక్తికరం. గతంలో తనకు సీమశాస్త్రి... సీమ టపాకాయ్‌ లాంటి సక్సెస్‌ ఫుల్‌ సినిమాలు ఇచ్చిన జి.నాగేశ్వరరెడ్డితో జట్టు కట్టాడు నరేష్‌. వీళ్లిద్దరి కాంబినేషన్లో 'ఇంట్లో దెయ్యం.. నాకేం భయ్యం' అనే సినిమా రాబోతోంది. బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ లాంటి పెద్ద నిర్మాత ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం. ఐతే తెలుగులో హార్రర్‌ కామెడీలు ఇప్పటికే మొహం మొత్తేసిన నేపథ్యంలో ఆ జానర్లో వస్తున్న ఈ సినిమాలో కొత్తగా ఏం చూపిస్తారన్నది సందేహం. ఐతే ఇందులో కూడా పాత సినిమాల ఛాయలు కనిపిస్తాయని.. నరేష్‌ కొన్ని స్పూఫులు చేస్తాడని అంటున్నారు. ఇప్పటిదాకా వేరే హీరోల్ని అనుకరించిన అల్లరోడు.. ఇప్పుడు దయ్యం పాత్రల స్పూఫులు చేస్తాడా అని చర్చించుకుంటున్నారు జనాలు. ఏం చేసినా.. ఈసారైతే అల్లరోడు హిట్టు కొట్టి తీరాలి. కాంబినేషన్‌ అయితే బాగానే సెట్‌ చేసుకున్నాడు కానీ.. రిజల్ట్‌ ఎలా ఉంటుందో చూడాలి. అక్టోబర్లో ఈ సినిమా రిలీజవుతుంది.

English summary
latest Buzz about Allari Naresh's up coming Movie "Intloa dayyam Naakem bhayyam" is againe a spoof comedy of old horrore movie
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu