»   » "చిన్న చియాన్" హాలీవుడ్ హీరోలా ఉన్నాడు... సంచలన కథతో వస్తాడట

"చిన్న చియాన్" హాలీవుడ్ హీరోలా ఉన్నాడు... సంచలన కథతో వస్తాడట

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినిమా రంగంలో తొలినాళ్లలో నిలదొక్కుకోవడానికి ఎన్నో ఏళ్లు పట్టేది. నాయక పాత్ర లభించడమంటే అంత సులభంకాదు. అంతకుముందు చిన్నాచితకా పాత్రల్లో తమ నటనా కౌశలాన్ని చూపాల్సి వుంటుంది. ఆనాటి నిర్మాతలకు, దర్శకులకు వారి నటన నచ్చాలి, మెచ్చాలి. అప్పటికి గాని వారికి హీరో అవకాశం రాదు. నాటి రోజుల్లో అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారక రామారావు తమ నటనను చిన్న పాత్రల్లో అద్భుతంగా ప్రదర్శించాక గానీ హీరోలు గా ప్రమోట్ కాలేక పోయారు.

కేవలం తమ నటన ద్వారానే అప్పటి స్టార్ నిర్మాణ సంస్థలైన విజయా, వాహినీ, పద్మశ్రీ, భరణీ లాంటి వారి దృష్టిని ఆకర్షించగలిగారు. నట జీవితంలో ఒక్కో మెట్టు ఎక్కారు. చాలా కష్టాలే ఎదుర్కొన్నారు. ఎత్తుపల్లాలను అధిగమించారు. చలనచిత్ర రంగంలో ఓ అత్యున్నత స్థాయికి ఎదిగారు. అలా ఎదగటం వెనక వారి కృషి, పట్టుదల వుంది. తవాత వచ్చిన వారసుల తోనూ సినీ ఇండస్ట్రీలు నిండిపోతున్నాయి. ఇప్పుడు ఇంకో స్టార్ దిగుతున్నాడు. తమిళ్ తెలుగు రెండిటి లోనూ మంచి స్టార్ డం ఉన్న హీరో తన కొడుకుని అంతే అనుభవం అదే స్టార్ ఫాలోయింగ్ ఉన్న దర్శకుడితో పరిచయం చేయ బోతున్నాడు... ఇమంతకీ ఆ నటుడూ.., నటవారసుడూ ఎవరంటే...

90శాతం ఏదో ఒక వారసుడిదే:

90శాతం ఏదో ఒక వారసుడిదే:

పేరున్న నటుడు తన వయసయిపోతున్న తరుణంలో తన వారసుడిగా తమ కుటుంబ సభ్యులను హీరోలుగా పరిచయం చేస్తూ సినిమాలు నిర్మించటం ఇప్పుడు మామూలైపోయింది. వారిలో నటించే దమ్ము ఉందాలేదా అనేది అనవసరం భారీ బడ్జెత్ తో, ఓ పెద్ద డైరెక్టర్‌తో ఓ భారీ చిత్రంతో వారసులను లాంచ్ చేస్తున్నారు. ఒకటి రెండు ఫట్ అయినా, తమ పలుకుబడి శక్తిసామర్థ్యాలతో మరో చిత్రం తీస్తున్నారు. జనంమీదికి వదులుతున్నారు. పైగా నేడు విడుదలయ్యే వాటిలో 90శాతం ఏదో ఒక వారసుడిదే...!

టాలీవుడ్ లోనే కాదు:

టాలీవుడ్ లోనే కాదు:

ప్రేక్షకులు చూడక తప్పుతుందా..! వీరిలో కొందరు ఒకటీ అరాతో ఆగిపోతున్నారు. ఏది ఏమైనా.. సరుకున్న వారసులు ఒకటి రెండింటిలో ఫట్‌మన్నా ఆ తర్వాత నిలబడుతున్నారు. సరుకు లేని వారసులు అపజయాల దెబ్బలకు తట్టుకోలేక తెరమరుగవుతున్నారు. అయితే ఈ వారసుల ఎంట్రీలు మన టాలీవుడ్ లోనే కాదు అటు బాలీవుడ్ లోనూ, ఇటు కోలీవుడ్ లోనూ ఉన్నాయి... ఇప్పుడు కొత్త వారసుడు... అద్బుతమైన నటుడు, హీరో నుంచి వస్తున్నాడు... అదెవరంటే తెలుగు తమిళ భాషల్లో నూ పరిచితుడైన చియాన్ విక్రం కొడుకు ధృవ్....

విక్రమ్ కుమారుడు:

విక్రమ్ కుమారుడు:

చియాన్ విక్రమ్ కు టీనేజ్ కొడుకు, కూతురు ఉన్నారంటే నమ్మబుద్ది కాదు. ఈ 48 ఏళ్ల స్టార్ ఇప్పటికీ తన శరీరంతో ప్రయోగాలు చేస్తూ అందరనీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఆయనకు టీనేజ్ కుమార్తె అక్షిత, కుమారుడు ధ్రువ్ ఉన్నారు.త్వరలోనే విక్రమ్ కుమారుడు...ధృవ్ త్వరలోనే సౌత్ ఇండియన్ సూపర్ డైరెక్టర్ శంకర్ తో కలిసి ఒక భారీ సినిమాతో ఎంట్రీ ఇవ్వనున్నాడట.

డైరెక్టర్ శంకర్:

డైరెక్టర్ శంకర్:

ఇప్పటికే వారసుల ఎంట్రీలతో అన్ని ఇండస్ట్రీ లు నిండి పోతుండగా , మరో వారసుడు తెరంగేట్రం చేయడానికి రెడీ అవుతున్నాడు..అంతే కాదు ఇతడిని ఎంట్రీ ఇస్తుంది కూడా మాములు డైరెక్టర్ కాదు, తన సినిమాలతో సంచలనం రేపి , బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ సునామి సృష్టించిన డైరెక్టర్.. శంకర్ కావటం విశేషం...

బెస్ట్ యాక్టర్ :

బెస్ట్ యాక్టర్ :

తెలుగులో ఇప్పుడున్న హీరోల్లో డెభ్బైఐదు శాతం వారసులే అంటే ఆశ్చర్యం లేదు. అలాగే తమిళంలోనూ యాభైకి పైగా వారస హీరోలే ఉన్నారు. ఇక కోలీవుడ్ లో ఇప్పుడు మరో వారస హీరో ఎంట్రీకి సంబంధించిన హాట్ న్యూస్ వినిపిస్తున్నాయి. కమల్ హాసన్ తర్వాత సౌత్ లో ది బెస్ట్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న విక్రమ్ తనయుడు ధ్రువ్‌ కృష్ణ కీ సినిమాలంటే ఇష్టం. లండన్‌లో చదువుకుంటున్న ధ్రువ్‌ రీసెంట్ గా ‘గుడ్‌ నైట్‌ చార్లీ' అనే ఓ షార్ట్ ఫిలిమ్ లో నటించాడు. దానికి మంచి స్పందన వచ్చింది.

గుడ్‌ నైట్‌ చార్లీ:

గుడ్‌ నైట్‌ చార్లీ:

ధ్రువ్‌ నటన చూసి ‘తండ్రికి తగ్గ తనయుడు' అంటున్నారంతా. దీన్ని బట్టే ధ్రువ్‌ని వెండితెరపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలైపోయాయని తెలుస్తోంది. ధ్రువ్‌ కోసం విక్రమ్‌ కొన్ని కథలు వింటున్నాడట. షార్ట్ ఫిలిం ‘గుడ్ నైట్ చార్లీ ఇప్పటికే యూట్యూబ్ లో మంచి ఆదరణ పొందుతోంది. చాలామంది ఫిలిం సెటబ్రెటీలు సైతం ఈ షార్ట్ ఫిలిం చూసి విక్రమ్ కొడుకుపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. విక్రమ్ కూడా చాలా ఫోన్ కాల్స్ అందుకున్నాడట కొడుకు విషయంలో. ఇంకా తెరంగేట్రం చేయకముందే కొడుకు అందరి కళ్లలో పడటంపై విక్రమ్ చాలా హ్యాపీగా ఉన్నాడు.

భవిష్యత్తు బాగుంటుందని:

భవిష్యత్తు బాగుంటుందని:

భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వం వహించనున్న చిత్రం ద్వారా ధ్రువ్ పరిచయమవుతాడని చెన్నయ్ టాక్. శంకర్ వంటి దర్శకుడి చిత్రం ద్వారా పరిచయమైతే తనయుడి భవిష్యత్తు బాగుంటుందని విక్రమ్ భావిస్తున్నారట. ధ్రువ్ కోసం తాను విలన్‌గా చేయడానికి కూడా సిద్ధపడ్డారని సమాచారం.. వాస్తవానికి రజనీకాంత్ కథానాయకునిగా, ఆమిర్‌ఖాన్‌ని ప్రతినాయకునిగా అనుకుని శంకర్ ఈ కథ రెడీ చేశారట.

తండ్రికి తగ్గ తనయుడు:

తండ్రికి తగ్గ తనయుడు:

కానీ, ఆమిర్ తిరస్కరించడంతో విక్రమ్‌ని శంకర్ అడిగారని, ఆయన ఆనందంగా అంగీకరించారని భోగట్టా.ప్రస్తుతం ధ్రువ్ లండన్లో ఫిలిం యాక్టింగ్ కోర్సులు చేస్తున్నాడు. అవి పూర్తవడానికి ఇంకో ఏడాది సమయం పట్టొచ్చు. ఆ లోపు శంకర్ ఫ్రీ అయితే ఆయనతోనే సినిమా చేసే అవకాశముంది. అదే జరిగితే అతడి అదృష్టమే. మరి ధ్రువ్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటాడా లేదో చూడాలి.

English summary
According to a report, director Shankar will be bankrolling the movie With Dhruv krishna who is son of Chiyan Vikram
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X