»   » రాజ్ తరుణ్ V/S దిల్ రాజు : ఏం జరుగుతోంది..?

రాజ్ తరుణ్ V/S దిల్ రాజు : ఏం జరుగుతోంది..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

యంగ్ హీరో రాజ్ తరుణ్ వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నాడు. ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మామ, కుమారి 21ఎఫ్ లాంటి వరుస హిట్స్ తో హ్యాట్రిక్ సాధించాడు రాజ్ తరుణ్ . అయితే నాలుగో సినిమాగా వచ్చిన సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు ఫ్లాప్ అయినా రాజ్ తరుణ్ జోరుకు మాత్రం బ్రేక్ పడలేదు.'ఈడోరకం ఆడోరకం' సక్సెస్ తో మళ్లీ గాడిలో పడిపోయాడు. రాజ్ తరుణ్ కి కథ .. స్క్రీన్ ప్లే పై మంచి పట్టుంది. ఇప్పుడు అదే మనోడికి చిక్కులు తెచ్చిందని టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.

రాజ్ త‌రుణ్ - వేగేశ్న స‌తీష్ కాంబినేష‌న్లో దిల్ రాజు శతమానం భవతి అనే సినిమా మొదలు పెట్టిన సంగతి తెలిసిందే కదా.. ఈ సినిమా లీడ్ రోల్ లో సాయి ధరమ్ తేజ్ చేయవలసింది ఉండగా రాజ్ తరుణ్ తో రీప్లేస్ చేసినట్టు గా కూడా చెప్పుకున్నారామధ్య. అయితే మనోన్ని ఈ ప్రాజెక్గ్ నుంచి తప్పించారని సమాచారం.

is Rajtharun out from Dil Raju's project..?

యాక్టింగక కాకుండా ఇతర విషయాల్లో రాజ్ తరుణ్ జోక్యం ఎక్కువ కావడం వల్లనే, దిల్ రాజు 'శతమానం భవతి' నుంచి మనోన్ని తప్పించాడని అంటున్నారు. ఈ సినిమాను ఆయన శర్వానంద్ తో నిర్మించాలనే ఆలోచనలో ఉన్నాడట. స్క్రీన్ ప్లే పై అంతో ఇంతో తెలిసినంత మాత్రాన అది మార్చండీ..,ఇది మార్చండీ అంటూ విసిగించటం వల్లే రాజ్ ని పక్కన పెట్టారట.

ఇక రాజ్ తరుణ్ కథానాయకుడిగా సీనియర్ వంశీతో సినిమా నిర్మించాలనుకున్న మధుర శ్రీధర్ కూడా, మరో హీరో కోసం వెతుకుతున్నాడని అంటున్నారు. స్క్రిప్టు ను మార్చమనీ ., దర్శకుడిని మార్చమని రాజ్ తరుణ్ వత్తిడి చేస్తుండటం వల్లనే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయని చెబుతున్నారు.

English summary
Dil Raju removed Raj tharun and select Sharvanand for his new Project "Shathamanam Bhavati"
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu