»   » నాకు కాస్త పెద్ద సైజే ఇష్టం: జెనీలియా

నాకు కాస్త పెద్ద సైజే ఇష్టం: జెనీలియా

Posted By:
Subscribe to Filmibeat Telugu

జెనీలియా తనది ప్రత్యేకమైన టేస్ట్ అని చెప్పుకొస్తోంది. ఆ విషయాలు మాట్లాడుతూ... బ్యాగులైనా, ఇతరత్రా వస్తువులైనా కాస్త పెద్ద సైజులో ఉంటేనే నాకు బాగా ఇష్టం. స్త్టెల్‌ కన్నా సౌకర్యంగా ఉండటమే నాకు ముఖ్యమని చెప్పుకొస్తోంది. అలాగే తాను అన్ని విషయాలలోనూ చాలా నెమ్మిదిగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని అంటోంది. తనది మిడిల్ క్లాస్ మహిళ మెంటాలిటీ అని, డబ్బు విషయంలో ఆచి తూచి అడుగు వేస్తానంటోంది. తాను ఎంత జాగ్రత్త పరురాలో వివరిస్తూ... చిన్నప్పట్నుంచి నేను చాలా పొదుపరిని. ఆ మనస్తత్వం ఇంకా నన్ను వదిలిపెట్టలేదు. చూసిన ప్రతి వస్తువునూ కొనాలని ఎప్పుడూ ఆశపడను. అనవసర ఖర్చులకు ఆమడ దూరం. డబ్బు విలువ తెలిసిన వారెవరైనా హద్దుమీరి ప్రవర్తించరు అంది. దాన్ని సమర్ధించుకుంటూ అయినా డబ్బు సంపాదించడంలో ఉన్న కష్టం తెలిస్తే.. దాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కూడా అంతే జాగ్రత్తగా వ్యవహరిస్తారు అంది. ఇక బోయ్ ప్రెండ్స్ గురించి మీ టేస్ట్ ఏంటి అంటే నవ్వేసి ఊరుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ స్టార్ గా వెలుగుతున్న ఆమె రామ్ చరణ్ సరసన బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఆరెంజ్ చిత్రంలో చేస్తోంది. కొత్తగా తెలుగు ప్రాజెక్టులు ఏమీ కమిట్ కాలేదు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu