నా ఫొటో ఎవరు పంపారో తెలియదు :ఇషా చావ్లా

అనంతరం పలువురు సినిమా రంగానికి చెందిన వారు మావద్దకు వచ్చి విజయభాస్కర్ రచించిన కథను వివరించారన్నారు. కథ నచ్చడంతో తన అంగీకారం తెలపడంతో సినీరంగ ప్రవేశం జరిగిందన్నారు. సినీరంగంలోకి వస్తానని తాను ఎప్పుడూ వూహించ లేదని ఇషాచావ్లా తెలిపారు. నిడదవోలులో జరుగుతున్న సినీ షూటింగ్‌లో పాల్గొనేందుకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు.
తెలుగు సినీ పరిశ్రమలో అందుతున్న ప్రోత్సాహం మరవలేనిదన్నారు.2010లో తాను ప్రేమకావాలి చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశానని అన్నారు. ఆ చిత్రంలో హీరోగా తన సరసన ఆది నటించారన్నారు. ఇంతవరకు నాలుగు చిత్రాల్లో నటించానని, వాటిలో హాస్యనటుడు సునీల్‌తో నటించిన పూలరంగడు చిత్రంతో మంచి గుర్తింపు వచ్చిందన్నారు.
ఇంకా బాలకృష్ణ హీరోగా నటించిన శ్రీమన్నారాయణ, అలాగే సునీల్ హీరోగా నటించిన మిస్టర్ పెళ్లికొడుకు చిత్రాల్లో నటించానన్నారు. తనకు హిందీలో సల్మాన్‌ఖాన్, తెలుగులో నాగార్జున నచ్చిన హీరోలన్నారు. తాను పుట్టింది ఢిల్లీలో, చదివింది కూడా ఢిల్లీలోనేనన్నారు. తన తండ్రి యూపీఎస్‌లో కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారని, తల్లి గృహిణి అన్నారు. తనకు సినీరంగంలో ఎడిటింగ్ రంగంలో అనుభవం ఉందన్నారు.


Click it and Unblock the Notifications











