»   » సాయికి ఒళ్లు బలిసి కాదు, నాకు గుల లేదు: జగపతి బాబు

సాయికి ఒళ్లు బలిసి కాదు, నాకు గుల లేదు: జగపతి బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

"నిర్మాత సాయికి ఒళ్లు బలిసి ఈ సినిమాను నిర్మించలేదు. నేనేదో గులతో ఇందులో హీరోగా నటించలేదు. జనాలు అలా ఎంతమాత్రం అనుకోని విధంగా 'పటేల్ సార్' ఉంటుంది" ఈ మాటలు ఎవరన్నారో ప్రత్యేకంగా చెప్పక్కరలేదు కదా...! పటేల్ సార్ గా కనిపించనున్న జగపతి బాబు అన్న మాటలే ఇవి. ఇంతకీ అంత చిరాకు ఎందుకు వచ్చిందీ అంటే. నిన్న పటేల్ సార్ ప్రెస్ మీట్లో అడిగినఒక ప్రశ్నకే, ఇంతకీ ఆ ప్రశ్నేఅమిటీ అంటే...

ఇండస్ట్రీనే నాకు గ్యాప్ ఇచ్చింది

ఇండస్ట్రీనే నాకు గ్యాప్ ఇచ్చింది

విలన్ పాత్రలు చేయడానికి ముందు గ్యాప్ తీసుకున్నారేంటి అని అడిగితే.. ''నేను గ్యాప్ తీసుకోలేదు. ఇండస్ట్రీనే నాకు గ్యాప్ ఇచ్చింది.అవకాశాలు లేకే ఖాళీగా ఉన్నాను'' అని నిర్మొహమాటంగా చెప్పేసాడు.. ఇదే ప్రశ్నకి వేరే హీరో గనక అయి ఉంటే సమాధానం ఎలా ఉండేదో మనకు తెలిసిందే కదా.ఫాల్ డౌన్ తర్వాత

ఫాల్ డౌన్ తర్వాత

ఒక ఫాల్ డౌన్ తర్వాత విలన్... క్యారెక్టర్ రోల్స్‌తో కెరీర్ అద్భుతంగా సాగిపోతున్న టైంలో జగపతిబాబు మళ్లీ హీరోగా మారి 'పటేల్ సార్' అనే సినిమా చేయడంపైనా కొందరు సెటైర్లు వేశారట. ఈ విషయంపైనా జగపతి బాబు స్పందించాడు. తనకు హీరో అనిపించుకోవాలనేమీ లేదని.. ఈ వయసులో తనకు హీరోగా చేయాల్సిన అవసరం కూడా లేదని.. కాకపోతే అప్పుడప్పుడూ ఇలాంటి ప్రయత్నాలు చేయకపోతే తనకు తానే బోర్ కొట్టేస్తానని జగపతిబాబు అన్నాడు.Jagapathi Babu's Patel SIR Movie Teaser Review | Filmibeat Telugu
కొత్త కెరీర్

కొత్త కెరీర్

ఫ్యామిలీ హీరో గా ఒక వెలుగు వెలిగి హీరోగా కెరియర్ ఎండింగ్ కు వచ్చిందని అనిపించుకున్న జగపతి బాబు సడెన్ గా విలన్ గా టర్న్ తీసుకుని కొత్త కెరియర్ స్టార్ట్ చేశాడు. విలన్ గా, సపోర్టెడ్ ఆర్టిస్ట్ గా జగపతి బాబు భాషతో సంబంధం లేకుండా తెగ బిజీ అయిపోయాడు. హీరోగా చేసిన దానికన్నా ఇప్పుడే సూపర్ సక్సెస్ ఫుల్ గా ఉన్నానని చాలా సార్లు చెప్పాడు కూడా.లెజెండ్ తో విలన్ గా

లెజెండ్ తో విలన్ గా

దర్శకుడు బోయపాటి శ్రీను జగపతి బాబు విలన్ గా లెజెండ్ సినిమాతో మళ్ళీ పరిచయం చేశాడు. దాంతో జగపతి కెరీర్ ఒక్కసారిగా ఊపందుకుంది. విలన్ గా టర్న్ తీసుకున్న తర్వాత జగపతి బాబుని ఫాలో అయ్యే వారి సంఖ్య పెరిగింది. అటుతమిళ్ లో కూడా విలన్ గా అవకాశాలు వస్తున్నాయి.మళ్లీ హీరోగా ఏంటి

మళ్లీ హీరోగా ఏంటి

స్వయంగా తన భార్యే 'చక్కగా ఇప్పుడు విలన్ వేషాలు చేసుకుంటున్నారు. మళ్లీ హీరోగా ఏంటి' అని అడిగిందని.. ఐతే ఈ కథలో ఉన్న ప్రత్యేకత వల్లే కథానాయకుడిగా నటించాల్సి వచ్చిందని జగపతిబాబు చెప్పాడు. ఈ సినిమా మీద చాలా అంచనాలేఉన్నాయి. ఒక వేళ ఈ సినిమా హిట్ అయినా తాను హీరో పాత్రలకు మాత్రమే పరితం అవడట, నచ్చిన పాత్ర ఏది వచ్చినా చేస్తానని గతంలోనే చెప్పాడు.
English summary
jagapati Babu said "I didn't do it for proving myself as a hero. In fact everybody is a hero in this film.. because the story is very strong. There is no need to do a film as a hero for me. But sometimes we have to do this kind of experiments.. otherwise I'll get bored of myself."
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu