»   » 'పిల్లా నువ్వు లేని జీవితం' లో జగపతి బాబు ఫస్ట్ లుక్

'పిల్లా నువ్వు లేని జీవితం' లో జగపతి బాబు ఫస్ట్ లుక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సాయిధర్మతేజ్, రెజీనా జంటగా ఏ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్నచిత్రం 'పిల్లా నువ్వు లేని జీవితం' . చిత్రంలోని కీలకపాత్రని జగపతిబాబు పోషిస్తున్నారు. ఆయన ఈ సినిమా చేస్తుండటంతో క్రేజ్ వచ్చింది. బుధవారం ఆయన పుట్టినరోజు కావడంతో జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు.

ఈ చిత్రంలో మొదట శ్రీహరిని అనుకుని సీన్స్ షూట్ చేసి,ఆయన మరణంతో జగపతిబాబుని తీసుకు వచ్చారు. ఆ విషయమై జగపతిబాబు మాట్లాడుతూ... శ్రీహరిగారంటే నాకు చాలా అభిమానం ఇష్టం. 'పిల్లానువ్వులేని జీవితం' సినిమాలో ఆయన స్థానాన్ని భర్తీ చేయాలి.. అని అడిగినప్పుడు ముందు 'వద్దు' అని చెప్పేశా. కానీ తప్పలేదు. కానీ.. షూటింగ్‌కి వెళ్లేముందు శ్రీహరి ఫొటోకి దండం పెట్టుకొని వెళ్లా అన్నారు.

ఈ చిత్రం షూటింగ్ ఈ నెల 17 నుంచి జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో జరుగుతుంది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నివాసు, హర్షిత్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. వేసవి శెలవులలో ఈ చిత్రం రిలీజ్ కానుంది. పూర్తి ఎంటర్టైనర్ గా చిత్రం రూపొందుతోందని తెలుస్తోంది.

జగపతిబాబు ఫస్ట్ లుక్ ఫోటోలు..స్లైడ్ షో లో...

నిర్మాతల్లో ఒకరైన బన్నివాసు మాట్లాడుతూ...

నిర్మాతల్లో ఒకరైన బన్నివాసు మాట్లాడుతూ...

'మా సినిమా ఇప్పటికి సగానికి పైగా పూర్తయింది. ఈ నెల 17 నుంచి నెలాఖరు వరకూ జంషెడ్‌పూర్‌లో రెండు ట్రైన్స్‌తో భారీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరిస్తాం. ఈ ఎపిసోడ్‌లో జగపతిబాబు, ప్రకాశ్‌రాజ్, షఫీ సహా హీరోహీరోయిన్లు పాల్గొంటారు. సినిమాలో ఇది కీలకమైన ఎపిసోడ్ కావడంతో చాలా భారీగా తీస్తున్నాం. మిగిలిన కార్యక్రమాలు పూర్తి చేసి సమ్మర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని తెలిపారు.

ఇన్నింగ్స్ కి ప్లస్

ఇన్నింగ్స్ కి ప్లస్

జగపతిబాబు మాట్లాడుతూ... 'లెజెండ్‌', 'రా రా కృష్ణయ్య', 'పిల్లా నువ్వులేని జీవితం' మూడు సినిమాల్లోనూ చాలా గొప్ప పాత్రలు దొరికాయి. ఇక నా ఇన్నింగ్స్‌కి ఢోకా లేదని ఈ సినిమాలు రుజువు చేస్తాయి అన్నారు.

ఆనందం...

ఆనందం...


గీతా ఆర్ట్స్‌లో నటిస్తుండడం ఆనందంగా ఉందని, షూటింగ్ అప్పుడే కొన్ని సినిమాలు హిట్ అవుతాయని నమ్మకం ఏర్పడుతుందని, ఈ సినిమా కూడా తన కుటుంబ ప్రేక్షకుల అభిమానం పొందేలా ఉందని జగపతిబాబు తెలిపారు.

షెడ్యూల్...

షెడ్యూల్...

ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ సగభాగం పైగా పూర్తయింది. 17 నుండి జార్ఖండ్‌లో భారీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్‌లో సినిమాలో నటిస్తున్న నటీనటులతోపాటుగా హీరో జగపతిబాబుకూడా ముఖ్యపాత్రలో కన్పించనున్నారు.

తెరముందు...వెనక

తెరముందు...వెనక

చంద్రమోహన్, జయప్రకాష్‌రెడ్డి, దువ్వాసి మోహన్, ప్రభాస్ శ్రీను, సత్యవాణి, రఘుబాబు, రజిత, జోష్ రవి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:అనూప్ రూబెన్స్, పాటలు:రామజోగయ్య శాస్ర్తీ, భాస్కరభట్ల, సుద్దాల అశోక్ తేజ, కెమెరా:దాశరధి శివేంద్ర, ఎడిటింగ్:గౌతమ్‌రాజు, మాటలు:డైమండ్ రత్నబాబు, వేమారెడ్డి, నిర్మాతలు:బన్ని వాసు, హర్షిత్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:ఎ.ఎస్.రవికుమార్ చౌదరి.

శుభాకాంక్షలు....

శుభాకాంక్షలు....

బుధవారం (ఫిబ్రవరి 12న ) జగపతిబాబు పుట్టినరోజు. దీంతో పాటు నటుడిగా ఇటీవల 25 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకొన్నారు. జగపతిబాబు పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఈ ఫస్ట్‌లుక్‌ విడుదల చేసింది. వన్ ఇండియా తెలుగు...పుట్టిన రోజు సందర్బంగా జగపతిబాబుకి శుభాకాంక్షలు తెలియచేస్తోంది.

English summary
Here are the first look stills of Family hero Jagapathi Babu playing the villian role in the film Pilla Nuvvu Leni Jeevitham movie starring Sai Dharma Tej and Regina in the lead roles, These are the brand new stills of JB released on the occasion of Jagapathi Babu's Birthday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu