»   » బాలకృష్ణ కి విలన్ గా ఆ గెటప్ లో కనిపిస్తా

బాలకృష్ణ కి విలన్ గా ఆ గెటప్ లో కనిపిస్తా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నెరిసిన గడ్డంతో ఈ సినిమాలో కనిపిస్తాను. ఇందులో మూడు తరాలకు సంబంధించిన పాత్రల్లో కనిపిస్తాను. యంగ్, మిడిల్, ఓల్డ్ ఏజ్ గెటప్స్. ఈ కథ, కేరెక్టర్ విన్న తర్వాత బాడీ లాంగ్వేజ్‌ని ఎలా కావాలంటే అలా మార్చుకుని చేస్తానని బోయపాటితో అన్నాను. మనస్ఫూర్తిగా ఇష్టపడి చేస్తున్న పాత్ర ఇది అంటూ చెప్పుకొచ్చారు జగపతిబాబు. ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా నటిస్తున్న చిత్రంలో విలన్‌గా యాక్ట్ చేయడానికి అంగీకరించారాయన. బోయపాటి శ్రీను దర్శకత్వంలో సాయి కొర్రపాటి సమర్పణలో రామ్ ఆచంట, గోపి ఆచంట, అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులోని పాత్రను సవాల్‌గా తీసుకున్నానంటున్నారు జగపతిబాబు.


ఇక విలన్ కేరక్టరే అయినా రొటీన్‌కి భిన్నంగా ఉంటుంది. పంచెలు కట్టుకుని, పెద్ద పెద్ద మీసాలు పెట్టుకుని ఆ టైప్‌లో ఉండదు. చాలా స్టయిలిష్‌గా ఉంటుంది. ఇటాలియన్ స్టయిల్‌లో ఉంటుంది. బేసిక్‌గా నాకా స్టయిల్ ఇష్టం. బాలయ్య పాత్రతో ఢీ అంటే ఢీ అనే తరహా పాత్ర నాది. ఇలాంటి పాత్ర కోసమే ఎదురు చూస్తున్నాను. వాస్తవానికి నేనెలాంటి పాత్ర అయినా చేస్తానని మూడేళ్ల క్రితమే ప్రకటించాను. కానీ రాలేదు. ఇప్పుడీ సినిమాకి అడిగారు అని అన్నారు.

ఇరవయ్యేళ్ల క్రితం నువ్వు హీరోగా పనికి రావన్నారు. అప్పుడు ఒక్క సినిమాలో యాక్ట్ చేసినా చాలని ఏడ్చిన రోజులున్నాయి. అలాంటిది ఏకంగా వంద సినిమాల్లో యాక్ట్ చేసేశాను. ఆశకు అంతు ఉండాలి. అది లేకపోతే కష్టం. హీరోలు విలన్లుగా చేయడం హాలీవుడ్‌లో ఎప్పుడో ఉంది. ఆ తర్వాత బాలీవుడ్‌లో సంజయ్‌దత్, అజయ్‌దేవగన్‌లాంటి వాళ్లు హీరోలుగా, విలన్లుగా చేస్తున్నారు. మన దగ్గర కూడా ఆ ట్రెండ్ ప్రారంభమవ్వాలి. కళాకారులు అన్ని రకాల పాత్రలు చేయాలిలాంటివి చెప్పను. కానీ ఓ ఆర్టిస్ట్‌గా మాత్రం ఏ పాత్ర అయినా చేసి నిరూపించుకోవాలనేది నా తపన.

ప్రస్తుతం హీరోగా రెండు, మూడు సినిమాలున్నాయి. నేను హీరోగా పీక్‌లో ఉన్నప్పుడే 'అంతఃపురం'లో యాంటి షేడ్స్ ఉన్న కేరక్టర్ చేశాను. ఆ తర్వాత 'అనుకోకుండా ఒక రోజు'లో మంచి పాత్ర చేశాను. ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు చేశాను. కొన్ని విడుదల కాలేదు. విడుదలైనవి ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు పోయాయో తెలియలేదు. కొన్ని పాత్రలు నచ్చకపోయినా డబ్బు కోసం చేశాను. నచ్చని పాత్రలను కష్టపడి చేశాను. ఈ పాత్రను ఇష్టపడి చేయబోతున్నాను. ఇలాంటి ఓ మంచి పాత్ర రావడం నటుడిగా నాకు రీ-బర్త్. అందుకే ఒప్పుకున్నాను అని చెప్పారు.

English summary
Jagapathi Babu is going to be seen as a villain in Balakrishna’s film. Boyapati Sreenu is the director of this movie and 14 Reels Entertainment banner is producing this venture in association with Sai Korrapati. "I have been doing some very bad films lately.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X