twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫ్యాన్స్ కోట్ల రూపాయల విరాళం: భావోద్వేగానికి గురైన పవన్ కళ్యాణ్, ఏమన్నారంటే...

    |

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే పిచ్చిగా అభిమానించే వారు తెలుగు రాష్ట్రాల్లో ఎంత మంది ఉన్నారో లెక్కవేయడం కష్టమే. ఆయనకు ఇంత మంది అభిమానులు ఏర్పడటానికి కారణం ఆయన చేసిన సినిమాలకంటే ఆయన వ్యక్తిత్వమే కారణమని చాలా మంది చెబుతున్నమాట.

    సినిమాల ద్వారా కోట్ల రూపాయలు సంపాదించే అకాశం ఉన్నా, లగ్జీరీ లైఫ్ జీవించే పరిస్థితులు ఉన్నా... అవన్నీ వదిలేసి ప్రజల కోసం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఆయన్ను ఫాలో అయ్యేవారి సంఖ్య మరింత పెరిగింది. కుళ్లపోయిన వ్యవస్థలో, ప్రజల్లో మార్పు తేవడమే లక్ష్యంగా ఆయన జనసేన పార్టీ స్థాపించారు.

    సైరా విషయంలో రాంచరణ్ దద్దరిల్లే మెగా ప్లాన్.. పవన్ కల్యాణ్ రంగంలోకి!సైరా విషయంలో రాంచరణ్ దద్దరిల్లే మెగా ప్లాన్.. పవన్ కల్యాణ్ రంగంలోకి!

    అభిమానులు అండగా...

    అభిమానులు అండగా...

    పవన్ కళ్యాణ్‌కు ముందు నుంచీ అండగా ఉన్న అభిమానులు పార్టీ స్థాపించిన తర్వాత కూడా ఆయన వెంటన నడిచారు. ఇటీవల జరిగిన ఎన్నిల్లో వారు క్షేత్రస్థాయిలో పని చేశారు. ఎన్నికల్లో పార్టీని గెలిపించ లేక పోయినా ఓట్ల పర్సంటేజ్ రాబట్టడంలో సక్సెస్ అయ్యారు.

    పార్టీకి కోసం భారీగా ఫండ్ పంపిన ఫ్యాన్స్

    పార్టీకి కోసం భారీగా ఫండ్ పంపిన ఫ్యాన్స్

    సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని అభిమానులు జనసేన పార్టీ కోసం భారీగా విరాళం అందించారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వేలాది అభిమానులు పంపిన ఈ విరాళం అంతా కలిపితే రూ. 3 కోట్లకుపైగా పోగైంది.

    భావోద్వేగానికి గురైన పవన్ కళ్యాణ్

    అభిమానుల విరాళంపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ... నా పుట్టినరోజుకు మెసేజ్ ఏదో వచ్చింది.. దాదాపు 33 వేల మంది పైచిలుకు రూ. 3 కోట్లపైన పార్టీ ఫండ్ పంపించారని... వారు ఇచ్చింది రూ. పది, వంద, వెయ్యి ఎంతైనా కావొచ్చు నేను తెలియజేయాల్సిన అవసరం ఉంది అంటూ పవన్ కళ్యాణ్ భావోద్వేగానికి గురయ్యారు.

    ఇది మాది అని పెట్టిన పెట్టుబడి

    ఇది మాది అని పెట్టిన పెట్టుబడి

    వారు పెట్టిన పెట్టుబడి ఇది మాది అని పెట్టిన పెట్టుబడి, దాన్ని నేను కొన్ని వేల కోట్లుగా భావిస్తాను. ఇది మనకు ఉన్న శక్తి, ఈ బలం కేవలం సినిమాల పరంగా వచ్చింది కాదు. మనం నిజంగా ఏదో ఒకటి చేయాలి అనే భావన జనసేనలో ఉందనడానికి ఈ విరాళాలే నిదర్శనమన్నారు.

    English summary
    JanaSena Chief Pawan Kalyan about Donations on his Birthday. JanaSena or JanaSena Party is an Indian political party in the states of Andhra Pradesh and Telangana, founded by MR. Pawan Kalyan in March 2014.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X