Just In
- 1 hr ago
అలాంటి కామెంట్లు పెట్టారో అంతే సంగతి.. వారికి థ్యాంక్స్ చెప్పిన అనసూయ, చిన్మయి
- 1 hr ago
ఇంట్రెస్టింగ్ అప్డేట్: అల్లు అర్జున్ సినిమాలో విలన్ నవదీప్ కాదు.. ఈ సీనియర్ నటుడే.!
- 1 hr ago
శబ్దం, శాసనం అంటూ బోయపాటి స్టైల్ డైలాగ్‌లు.. మళ్లీ బాలయ్య రచ్చ రచ్చే
- 2 hrs ago
ఫ్యాన్సీ రేట్‌కు వరల్డ్ ఫేమస్ లవర్.. విజయ్ క్రేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు
Don't Miss!
- Finance
కుబేరులనూ వదలని ఆర్థిక మాంద్యం: బిజినెస్ జెట్స్ కు గుడ్ బై!
- News
దిశ హత్య కేసు : రక్తం మరుగుతోంది... న్యాయం జరిగింది... ఎన్‌కౌంటర్‌పై జనసేనాని స్పందన
- Sports
ఉప్పల్ స్టేడియంలో తొలి టీ20: టీమిండియా విజయ లక్ష్యం 208
- Lifestyle
పురుషుల్లో ప్రారంభంలోనే స్ఖలనం? నయం చేయడానికి చిట్కాలు!
- Technology
5జీ కోసం జియో,ఫ్లిప్‌కార్ట్,అమెజాన్లతో జట్టుకట్టిన క్వాల్కామ్
- Automobiles
డస్టర్ మీద లక్షన్నర రూపాయల ధర తగ్గించిన రెనో
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
రాజశేఖర్ కారు ప్రమాదం.. ఆయనను వారే కాపాడారు.. అసలు విషయాలు చెప్పిన జీవిత
హీరో రాజశేఖర్ కారు ప్రమాదానికి గురయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న కారు టైర్లు పేలడంతో అదుపు తప్పి పల్టీ కొట్టింది. వెంటనే కారులో ఉన్నఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో ఆయనకు పెను ప్రమాదం తప్పింది. అయితే ఈ ప్రమాదంపై మీడియాలో పలు రకాల కథనాలు వస్తోన్న నేపథ్యంలో ఆయన సతీమణి జీవిత క్లారిటీ ఇచ్చింది.

స్పందించిన రాజశేఖర్..
క్షేమంగా ఇంటికి చేరిన రాజశేఖర్ తనకు జరిగిన ప్రమాదంపై స్పందించారు. ‘మంగళవారం రాత్రి రామోజీ ఫిల్మ్ సిటీ నుండి ఇంటికి వస్తుండగా ఔటర్ రింగు రోడ్డులో పెద్ద గోల్కొండ అప్పా జంక్షన్ వద్ద నా కారు ప్రమాదానికి గురైంది. అప్పుడు కారులో నేను ఒక్కడినే ఉన్నాను. ఎదురుగా వస్తున్న కారులో వారు ఆగి, నా కారు దగ్గరకు వచ్చారు. లోపల ఉన్నది నేనే అని గుర్తు పట్టి, విన్ షీల్డ్ లోనుండి బయటకు లాగారు' అని చెప్పారు.

మద్యం సేవించడాని రూమర్లు..
ఆయన కారులో మద్యం సీసాలు లభించాయని, మితి మీరిన వేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, మద్యం సేవించి వాహనం నడిపారని ఇలా వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. అయితే వీటన్నంటిపై జీవిత స్పందించింది. ప్రమాదం జరిగిన విషయం తదనంతరం జరిగిన పరిణామాల గురించి ఓ వీడియో ద్వారా అందరికీ తెలిపింది.

టైర్లు పేలడంతోనే ప్రమాదం..
ఆయన రామోజీ ఫీల్మ్ సిటీ నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని, కారు టైర్లు బరస్ట్ అవ్వడం వల్ల డివైండర్‌ను ఢీకొట్టి అటు వైపు బోల్తా కొట్టిన్నట్లు తెలిపింది. అయితే అటువైపు నుంచి ఓ కారులోంచి వస్తోన్న ఓ ఫ్యామిలీ.. రాజశేఖర్‌ను గుర్తు పట్టినట్లు, వారే ఆయనను కాపాడినట్టు తెలిపింది. వారి దగ్గర నుంచి ఫోన్ తీసుకుని మాకు, పోలీసులకు జరిగిన విషయాన్ని తెలిపారు.

క్షేమంగానే ఉన్నారు..
అనంతరం వారి కారులో వస్తున్నానని తెలిపాడు. మేము కూడా బయల్దేరి మధ్యలో ఆయన్ను తమ కారులో ఎక్కించుకుని వెళ్లామని తెలిపింది. అయితే అర్దరాత్రి నుంచి తాను పోలీసులతో టచ్‌లోనే ఉన్నానని తెలిపింది. ప్రతీ విషయం వారికి తెలియపరుస్తున్నానని పేర్కొంది. రాజశేఖర్‌కు ఎలాంటి దెబ్బలు తగల్లేదని, చిన్నగా గీసుకుపోయిందని, బాడీ పెయిన్స్ ఉన్నాయంటే డాక్టర్ వచ్చి పెయిన్ కిల్లర్ ఇచ్చాడని తెలిపింది. ఆయన క్షేమంగానే ఉన్నాడని స్పష్టం చేసింది.

స్టేట్‌మెంట్ ఇవ్వాలని కోరారు..
అక్కడి పోలీసులను సంప్రదిస్తూనే ఉన్నానని, ఫార్మాలీటిస్ అన్నింటిని పూర్తి చేశానని తెలిపింది. అయితే రాజశేఖర్ వచ్చి జరిగిందంతా స్టేట్‌మెంట్ ఇవ్వాలని కోరారు. అయన కోలుకున్నాకే రమ్మని చెప్పారని తెలిపింది. దీంతో రాజశేఖర్ కారు ప్రమాదంపై వస్తున్న రూమర్లకు జీవిత చెక్ పెట్టింది.

గతంలో కారు ప్రమాదం..
గతంతో కూడా రాజశేఖర్ ఇలాగే కారు ప్రమాదానికి గురయ్యారు. 2017 సంవత్సరం అక్టోబర్ 9న ఆయన కారు ప్రమాదానికి గురైంది. ఆ రోజు రాత్రి పీవీ ఎక్స్‌ప్రెస్ హైవేపై ప్రయాణిస్తున్న మరో కారుని తన కారుతో ఢీ కొట్టారు. రాజశేఖర్ ఆ రోజు తాగి డ్రైవ్ చేసినట్టు బాధితులు ఫిర్యాదు చేశారు. అప్పట్లో పోలీసులు డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించగా ఆయన తాగలేదని రుజువయ్యింది.